Vidya Balan: బాలీవుడ్ నటి విద్యాబాలన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందం, అభినయం రెండు కలగలిపిన నటీమణుల్లో ఈ భామ పేరు ముందు ఉంటుంది. హిందీలోనే కాదు తెలుగులో కూడా విద్యాకు ఫ్యాన్స్ ఉన్నారు. ఎన్టీఆర్ బయోపిక్ గా వచ్చిన కథానాయకుడు సినిమాలో ఎన్టీఆర్ భార్య బసవతారకంగా నటించి మెప్పించింది. ఆ చీరకట్టు, బొట్టుతో అచ్చతెలుగు మహిళలా కనిపించింది. ఇక ఇదే విద్యా.. డర్టీ పిక్చర్ లో కాకరేపింది. సిల్క్ స్మితగా అమ్మడి అందాల ఆరబోతకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు అంటే అతిశయోక్తి కాదు. విద్యా సినిమాల్లోనే రెబల్ కాదు బయట కూడా అంతే. బాడీ షేమింగ్ గురించి ఆమె మాట్లాడే విధానం ఎంతోమందికి స్ఫూర్తి నింపింది. ఇక ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే.. ఈ బ్యూటీ ఒక హాట్ ఫోటోషూట్ చేసింది.
Hamsa Nandini: రొమ్ము క్యాన్సర్.. పోరాడి గెలిచిన నీ ధైర్యానికి హ్యాట్సాఫ్
ఫోటో షూట్ పాతదే అయినా మరోసారి రీపోస్టు చేసేసరికి అగ్గి రాజుకుంది. నీ వయస్సెంత.. నీ బాడీ ఏంటి.. నువ్వు చేసే ఫోటోషూట్స్ ఏంటి అని నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. అంతలా ఆ ఫొటోలో ఏముంది అంటే.. అమ్మడి నగ్న రూపం దాగుంది అన్నమాట. ఒక చైర్ లో నగ్నంగా కూర్చొని బాడీకి పేపర్ ను అడ్డుపెట్టుకొని గ్లాసెస్ పెట్టుకొని మంచి హాట్ లుక్ ఇచ్చింది. దీంతో 40 దాటాకా ఇలాంటి ఫోటోషూట్స్ అవసరమా అని కొందరు.. ఆ పేపర్ మాత్రం అడ్డు ఎందుకు.. డర్టీ పిక్చర్ చూపించాల్సింది అంటూ కౌంటర్లు వేస్తున్నారు. అంతేకాకుండా ఇలాంటి ఫోటోషూట్స్ ను తీస్తున్న డబూ రత్నాని కూడా ఏకిపారేస్తున్నారు.. కొంచెం కూడా నీకు సిగ్గు లేదు అంటూ తిట్టిపోస్తున్నారు. ఏదిఏమైనా ఈ ఫోటోలు మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. మరి ఈ ట్రోల్స్ పై విద్యా ఏమైనా స్పందిస్తుందో లేదో చూడాలి.