2007 లో రియల్ స్టార్ శ్రీహరి హీరోగా ఫైట్ మాస్టర్ విజయ్ దర్శకత్వంలో రూపొందిన `మహాలక్ష్మి` సినిమాతో టాలీవుడ్ లో కెరీర్ ని ప్రారంభించిన హీరోయిన్ పూర్ణ. ఇక ఈ సినిమా తరువాత అల్లరి నరేష్ సరసన ‘సీమటపాకాయ్’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత ర్వైబాబు దర్శకత్వంలో అవును, అవును 2 లాంటి హర్రర్ చిత్రాలలో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ వరుస అవకాశాలను అయితే అందుకుంది కానీ విజయాలను మాత్రం అందుకోలేకపోయింది. గత కొంత కాలంగా హీరోయిన్ గా క్రేజ్ తగ్గడంతో కీలక పాత్రల్లో నటిస్తూ వస్తున్న పూర్ణ టీవీ షోల్లోనూ మెరుస్తోంది. ముఖ్యంగా ఢీ డాన్స్ షోలో జడ్జిగా వ్యవహరిస్తూ ఫేమస్ అయ్యింది. స్వతహాగా డాన్సర్ అయ్యిన ఆమె.. అప్పుడప్పుడు డాన్స్ షోలలో తన సత్తా చూపిస్తోంది.
ఇక ఇటీవల ‘అఖండ’ చిత్రంలో కీలక పాత్ర పోషించి మెప్పించిన పూర్ణ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుంది.. నిజమే ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ కూడా చేసేసుకుంది. ఈ విషయాన్నీ తాజాగా ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. అంతేకాకుండా తనకు కాబోయే భర్తను కూడా అభిమానులకు పరిచయం చేసింది. “కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాను” అంటూ కాబోయే భర్తతో దిగిన ఫొటోను షేర్ చేసింది. ఇక పూర్ణకు కాబోయే భర్త పేరు షానిద్ ఆసిఫ్ ఆలీ అని తెలుస్తోంది.. అతడు జేబీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండీ అని సమాచారం. అంటే పూర్ణ బడా వ్యాపారవేత్తకు భార్యగా మారుతున్నదన్నమాట. మరి పెళ్లి తరువాత అమ్మడు సినిమాలకు గుడ్ బై చెప్తుందేమో చూడాలి.