Nivetha Pethuraj: నివేతా పేతురాజ్.. కోలీవుడ్ నుంచి వచ్చిన ఈ బ్యూటీ తెలుగులోనూ మంచి నటిగా కొనసాగుతోంది. మంచి కథలను ఎంపిక చేసుకొని ముందుకు దూసుకెళ్తోంది. ఇక ఇటీవలే బ్లడీ మేరీ తో ప్రేక్షకులను మెప్పించిన నివేతా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. నివేతా కేవలం నటి మాత్రమే కాదు ఆమె రేసింగ్ ఛాంపియన్ అని అందరికి తెల్సిందే. సర్టిఫైడ్ రేసర్ గా నివేతా ఎన్నో రేస్ కార్లను అవలీలగా నడిపింది. ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ హైదరాబాద్ లో ఫార్ములా రేస్ కారును లాంచ్ చేసింది.
కారు లాంచ్ అనంతరం ఆమె మాట్లాడుతూ “నాకు కార్లు అంటే చాలా ఇష్టం. ఈ కారు చూస్తుంటే నేను చిన్నపిల్లలా మారిపోతాను. నిజంగా ఈ ఫార్ములా రేస్ కారు నాకు చాలా బాగా నచ్చింది. అంతకు ముందు వెర్షన్ కొద్దిగా చిన్నగా ఉండేది. కానీ, ఇది ఎంతో కంఫర్ట్ బుల్ గా ఉంది” అని చెప్పుకొచ్చింది. ఇక ఇప్పుడు మీరెందుకు రేసింగ్ చేయడం లేదు అన్న ప్రశ్నకు నివేతా మాట్లాడుతూ ” నాకు రేసింగ్ చేయాలనీ ఉంది.. కానీ, నా నిర్మాతలు నన్ను రేసింగ్ చేయనివ్వడం లేదు. ఎందుకంటే నాకేదైనా అవుతుందని భయపడుతున్నారు. అందుకే నేను రేసింగ్ చేయడం లేదు. కొన్ని షూట్స్ ఉన్నాయి” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.