Pawan Kalyan: చిత్ర పరిశ్రమలో ఈ మధ్య హీరోలతో పాటు హీరోయిన్లుకూడా పెళ్ళికి సిద్ధమవుతున్నారు. ఇక కెరీర్ చేసుకున్నది చాలు.. వైవాహిక బంధంలోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్నారు. ప్రేమించిన వారితో ఏడడుగులు వేస్తున్నట్లు ప్రకటించి అభిమానులకు షాక్ ఇస్తున్నారు. ఇక తాజాగా బాలీవుడ్ బ్యూటీ నికీషా పటేల్ సైతం ఆ లిస్ట్ లో చేరిపోయింది. తెలుగులో పవన్ కళ్యాణ్ సరసన కొమరం పులి చిత్రంలో నటించి మెప్పించింది.
సినిమా హిట్ అవ్వకపోయినా అమ్మడికి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. అయినా ఆ తరువాత టాలీవుడ్ లో మాత్రం అమ్మడు కనిపించింది లేదు. ఇక అప్పుడప్పుడు సోషల్ ఇండియాలో ట్వీట్స్ తో రచ్చచేసి షాక్ ల మీద షాకులు ఇచ్చిన ఈ బ్యూటీ తాజాగా తాను త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు ప్రకటించింది. గత కొంతకాలంగా నికీషా, ఒక విదేశీయుడుతో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ఆమె, తన ప్రియుడుతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ దీపావళీ శుభాకాంక్షలు తెలిపింది. ఇక ఈ ఫోటో చూసిన వారందరు నికీషాకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరి ముందు ముందు ఈ అమ్మడు సినిమాలో కనిపిస్తుందో.. లేక పెళ్లి చేసుకొని విదేశాల్లో సెటిల్ అవుతుందో చూడాలి.