Nandini Kashyap : ఓ స్టూడెంట్ ను కారుతో ఢీకొట్టడంతో అతను చనిపోయిన కేసులో హీరోయిన్ అరెస్ట్ అయింది. ఆమె ఎవరో కాదు హిందీ నటి నందినీ కశ్యప్. జులై 25న తెల్లవారు జామున 3గంటల ప్రాంతంలో ఆమె ఓ పార్టీ నుంచి తన ఇంటికి బయలు దేరింది. బొలెరో కార్ లో వెళ్తుండగా దఖింగావ్ ఏరియాలో ఓ స్టూడెంట్ ను ఢీ కొట్టి అక్కడి నుంచి పారిపోయింది. ఆ స్టూడెంట్ ను సమియుల్ హక్ గా గుర్తించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జులై 29న మంగళవారం రాత్రి మరణించాడు.
Read Also : Puri-Sethupathi : చిరుతో తీయాల్సిన మూవీ సేతుపతితో చేస్తున్న పూరీ.. క్లారిటీ
బాధితుడు 21 ఏళ్ల పాలిటెక్నిక్ విద్యార్థిగా తెలుస్తోంది. యాక్సిడెంట్ లో అతని కాళ్లు విరిగిపోయినట్టు సమాచారం. తీవ్రంగా గాయపడటంతో చికిత్స పొందుతూ చనిపోయాడు.దాంతో ఆమెను గువహటి పోలీసులు హిట్ అండ్ రన్ కేసు నమోదు చేశారు. యాక్సిడెంట్ చేసింది నందినీ కశ్యప్ అని తేలడంతో అరెస్ట్ చేశారు. మరికొన్ని గంటల్లో ఆమెను కోర్టులో హాజరు పరుచనున్నట్టు డీసీపీ జయంత సారథి తెలిపారు.
Read Also : Kingdom : లక్ష టికెట్లు సేల్.. కింగ్ డమ్ హవా..