Mamatha Mohandas: సినిమా హీరోయిన్లకు ఏమవుతుంది.. ఎంతో గ్లామర్ గా ఉండే హీరోయిన్స్ వరుసగా వ్యాధుల బారిన పడుతున్నారు. సమంత, పునర్నవి, హంస నందిని.. ఇలా ఒకరి తరువాత ఒకరు అరుదైన వ్యాధుల బారిన పడుతున్నారు. ఇక తాజాగా మరో అరుదైన వ్యాధి బారిన పడింది హీరోయిన్ మమతా మోహన్ దాస్.. మలయాళ ముద్దుగుమ్మ మమతా మోహన్ దాస్ సింగర్ గా తెలుగు తెరకు ఎన్టీఆర్ సినిమాతోనే పరిచయమైంది. రాఖీ.. టైటిల్ సాంగ్ ను దేవి శ్రీ ప్రసాద్ తో కలిసి ఆలపించి షేక్ ఆడించింది. ఆ తరువాత యమదొంగ సినిమాతో ఎన్టీఆర్ సరసన నటించి మెప్పించింది. ఈ సినిమా తరువాత అమ్మడికి అవకాశాలు క్యూ కట్టాయి. స్టార్ హీరోలు వెంకటేష్, నాగార్జున సరసన నటించినా మమతాకు మాత్రం స్టార్ హీరోయిన్ గా గుర్తింపు రాలేదు. దీంతో మళయాళంలోనే సెటిల్ అయిపోయింది. దాదాపు నాలుగేళ్ళ క్రితం తాను క్యాన్సర్ తో బాధపడుతున్నట్లు చెప్పి మొదటిసారి మమతా షాక్ ఇచ్చింది. నాలుగేళ్లు పోరాటం చేసి క్యాన్సర్ బారి నుంచి బయటపడింది.
Chiranjeevi: ఆ మెసేజ్ పంపిన చిరు.. మూడేళ్లు అవైడ్ చేసిన సుమ
హమ్మయ్య మమతా ఎంతో దైర్యంగా క్యాన్సర్ ను జయించింది అని అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. ఇక ఈ ఆనందం కూడా అభిమానులకు ఎంతో కాలం నిలవలేదు. తాజాగా ఆమె మరో అరుదైన వ్యాధి బారిన పడినట్లు చెప్పుకొచ్చింది. ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనే చర్మ వ్యాధితో బాధపడుతున్నట్లు మమతా చెప్పుకొచ్చింది. దీనివలన తన చర్మ రంగును కోల్పోతున్నట్లు తెలిపింది. బొల్లి విటిలిగో క్రానిక్ అనేది.. చర్మం యొక్క రంగును తగ్గిస్తోంది. సాధారణంగా తెలుగులో బొల్లి అని చెప్పుకొస్తారు. చర్మం రంగు మారడం.. మచ్చలు రావడం జరుగుతూ ఉంటాయి. ఇక ఈ వ్యాధిపై ఇప్పుడు పోరాడుతున్నట్లు ఆమె తెలిపింది. దీంతో అభిమానులు అరెరే.. ఎన్టీఆర్ హీరోయిన్ కే ఎందుకు ఇన్ని కష్టాలు.. ఈ మధ్యనే క్యాన్సర్ నుంచి బయటపడింది.. మళ్లీ ఇప్పుడు ఇది.. ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామంటూ అభిమానులు చెప్పుకొస్తున్నారు.