Chiranjeevi:మెగాస్టార్ చిరంజీవిని జీవితంలో ఒక్కసారైనా కలవకపోతామా అనే ఆశతో బతికే అభిమానులు ఎంతోమంది. ఆయన ఫోన్ చేస్తే,.. మెసేజ్ చేస్తే పొంగిపోయి సోషల్ మీడియాలో ట్రెండ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక చిరు దగ్గరనుంచి ఒక చిన్న మెసేజ్ వచ్చిన జన్మ ధన్యమైపోతుంది అని ఎదురుచూసేవాళ్ళు లేకపోలేదు. చిరంజీవి మెసేజ్ చేసినా పట్టించుకోని వారున్నారా..? అంటే.. ఉన్నారని చిరునే స్వయంగా చెప్పుకొచ్చాడు.
చిరు మూడేళ్ళ నుంచి మెసేజ్ చేసినా ఆమె రిప్లై ఇవ్వడం పక్కన పెట్టండి.. కనీసం పట్టించుకోలేదట.. ఇంతకీ ఎవరామె అంటే.. స్టార్ యాంకర్ సుమ. అవును.. సుమ, చిరంజీవి మెసేజ్ కు కనీసం రిప్లై కూడా ఇవ్వలేదట. ఇటీవల వాల్తేరు వీరయ్య ప్రమోషన్స్ లో భాగంగా సుమ హోస్ట్ చేస్తున్న ఒక షోకు చిరు వెళ్లిన సంగతి తెల్సిందే. ఇక ఈ షోలో సరదాగా సందడి చేసిన చిరు.. ఈ షో లో కూడా చిరు లీక్స్ పేరుతో ఏదైనా మ్యాటర్ ను లీక్ చేయొచ్చుగా అని అడుగగా.. చిరంజీవి, సుమనే ఇరికించాడు. సుమ మూడేళ్ళ పాటు నేను మెసేజ్ చేసినా కూడా రిప్లై ఇవ్వలేదని చెప్పుకొచ్చాడు.
Chiranjeevi: ఆ మెసేజ్ పంపిన చిరు.. మూడేళ్లు అవైడ్ చేసిన సుమ
“మూడు, నాలుగేళ్లుగా సుమ ప్రతి పుట్టినరోజుకు.. హ్యాపీ బర్త్ డే సుమగారు.. గాడ్ బ్లెస్స్ యూ, స్టే స్ట్రాంగ్” అని మెసేజ్ పెట్టేవాడిని. దానికి రిప్లై వచ్చేది కాదు. చిరంజీవి మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వని ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే.. అది సుమనే” అని చెప్పుకొచ్చారు. అయితే సుమ రిప్లై ఇవ్వకపోవడానికి గల కారణం చెప్తూ.. తనవద్ద చిరంజీవి గారి నెంబర్ లేదని, ఆ నెంబర్ ఎవరిదో అనుకోని తాను లైట్ తీసుకున్నట్లు చెప్పుకొచ్చింది. అంతేకాకుండా తానెప్పుడూ చిరంజీవి గారు తనకు బర్త్ డే విష్ చేస్తారని అసలు ఊహించలేదని అని తెలిపింది. ఆ తరువాత ఒక ఈవెంట్ లో సుమను కలిసి చిరునే.. ఈ విషయం చెప్పడంతో ఆమె ఆశ్చర్యానికి గురై క్షమించమని కోరిందట. అప్పుడు చిరు నెంబర్ ను సేవ్ చేసుకున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.