Kunickaa Sadanand : ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీలలో బోల్డ్ కామెంట్లు చేయడం నటీనటులకు చాలా కామన్ అయిపోయింది. తమ జీవితంలో ఉండే చాలా విషయాలను ఓపెన్ గానే చెప్పేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఓ నటి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె ఎవరో కాదు బిగ్ బాస్ సీజన్-19 ద్వారా ఫేమస్ అయిన కునికా సదానంద్. ఆమె చాలా కాలంగా సినిమాల్లో బోల్డ్ పాత్రలు, వ్యాంప్ పాత్రలు చేస్తూ ఫేమస్ అయింది. అయితే తాజాగా హిందీ బిగ్ బాస్ లో కూడా మెరిసింది. ఇందులో తన జీవితంలో జరిగిన ఘటనలను పంచుకుంది ఈ బ్యూటీ.
Read Also : Chiranjeevi : వీసీ సజ్జనార్ ను కలిసిని మెగాస్టార్ చిరంజీవి
నేను యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు వరుసగా సినిమాల్లో నటించాను. ఆ టైమ్ లో ఓ వ్యక్తితో డీప్ డేటింగ్ చేశా. చివరకు అతను హ్యాండ్ ఇచ్చారు. ఆ బ్రేకప్ బాధ తట్టుకోలేక విపరీతంగా మద్యం అలవాటు చేసుకున్నా. ఎప్పుడు పడితే అప్పుడే తాగేదాన్ని. మా నాన్న చెప్పినా కంట్రోల్ చేసుకోలేదు. ఆ తర్వాత మెల్లిగా బయటపడ్డాను. ఆ తర్వాత నలుగురితో లివింగ్ ఇన్ రిలేషన్ లో ఉన్నా. కొన్నాళ్ల తర్వాత వారు కూడా నన్ను వాడుకుని వదిలి వెళ్లిపోయారు. ఆ తర్వాత వినయ్ లాల్ తో పెళ్లి అయింది. ఓ కొడుకు పుట్టాక ఇద్దరం విడిపోయాం అంటూ ఎమోషనల్ అయింది ఈ బ్యూటీ.
Read Also : Bigg Boss 9: బిగ్ బాస్9లో సూపర్ షాకింగ్ ఎలిమినేషన్