బిగ్ బాస్ సీజన్ 9 ఆసక్తికరంగా సాగుతోంది. కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీలు అంటూ మొదలైన ఈ షోలో, మొదటి వారం నుంచి కామనర్స్ లో ఒకరు ఎలిమినేట్ అవుతూ వస్తున్నారు. అందులో భాగంగా, మొదటి వారం ఒక సెలబ్రిటీ మాత్రమే ఎలిమినేట్ అయ్యారు. సృష్టి వర్మ మొదటి వారం ఎలిమినేట్ అవ్వగా, ఆ తర్వాత మర్యాద మనీష్, ప్రియా శెట్టి, గత వారం హరిత హరీష్ ఎలిమినేట్ అయ్యారు. ఇక ఈ వారం రాయల్ కార్డ్ ఎంట్రీ అంటూ పలువురు వైల్డ్ కార్డు ఇంట్రూ ఇవ్వబోతున్నారు.
Also Read:Ram Charan : ప్రధాని మోడీని కలిసిన రామ్ చరణ్ దంపతులు
మరోపక్క ఈ వారం ఇద్దరు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయినట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి ఈ వారం ఏకంగా 10 మంది నామినేషన్స్‌లో ఉన్నారు. వారిలో ముందుగా ఫ్లోరా షైనీ ఎలిమినేట్ అయింది. ఆ తరువాత మరొక కంటెస్టెంట్ కూడా ఎలిమినేట్ అయినట్లుగా తెలుస్తోంది. ఆ కంటెస్టెంట్ మరెవరో కాదు, దమ్ము శ్రీజ. కామనర్స్ కేటగిరీలో అగ్నిపరీక్ష ఎదుర్కొని హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె, మొదటి వారం నుంచే అందరితో దీటుగా పోటీ ఇస్తూ వచ్చింది. అయితే, తనను తాను ఎక్కువగా ఊహించుకుంటూ, ఆట మీద దృష్టి పెట్టకుండా ఇతర పంచాయతీలు చేస్తూ ఉండడంతో ఆమె మీద నెగెటివిటీ పెరిగింది. ఫైనల్లీ ఈ వారం పదిమంది నామినేషన్స్‌లో ఉండగా, ఫ్లోరా తరువాత దమ్ము శ్రీజ ఎలిమినేట్ అయినట్లుగా సమాచారం.