బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ స్టార్ హీరోయిన్ల రేసులో దూసుకెళ్తోంది. ఇటీవలే ఈ బ్యూటీ రామ్ చరణ్ కు జోడిగా శంకర్ పాన్ ఇండియా మూవీ “ఆర్సీ 15” సినిమాలో ఛాన్స్ అందుకుంది. కియారా, చరణ్ జంటగా వస్తున్న రెండవ చిత్రమిది. తాజాగా ఈ బ్యూటీ కార్ కలెక్షన్లో సరికొత్త లగ్జరీ కారును యాడ్ చేసింది. కియారా ఆడి A8L లగ్జరీ సెడాన్‌ను కొనుగోలు చేసింది. ఈ మేరకు ఆమెకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పిక్స్ లో ఈ బ్యూటీ పింక్ ప్యాంట్‌తో తెల్లటి టాప్‌తో చాలా అద్భుతంగా కనిపిస్తోంది.
Read Also : విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కు “లైగర్”డబుల్ ట్రీట్
ఆడి ఈ మోడల్‌ను గత ఏడాది భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.1.56 కోట్లు. కియారా దగ్గర ఇప్పటికే BMWX5, Mercedes Benz E Class, BMW 530d ఉన్నాయి. ఈ వాహనాలన్నీ చాలా ఖరీదైనవి. ఇక ఆమె వ్యక్తిగత జీవితం విషయానికొస్తే… ఈ బ్యూటీ సిద్ధార్థ్ మల్హోత్రాతో డేటింగ్ చేస్తోందని రూమర్లు ఉన్నాయి. డిన్నర్, లంచ్ డేట్లలో ఇద్దరూ చాలాసార్లు కలిసి కనిపించారు. వీరిద్దరి జోడీ “షేర్ షా”లో తొలిసారి కలిసి కనిపించింది. వీరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అభిమానులకు బాగా నచ్చింది.