విక్రమార్కుడు, మర్యాద రామన్న, పటాస్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి జయవాణి. టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న జయవాణి కెరీర్ ప్రారంభంలో తనకు జరిగిన చేదు అనుభవాన్ని ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. అవకాశం ఇస్తానని చెప్పి ఒక దర్శకుడు తనను మోసం చేశాడని చెప్పుకొచ్చారు. ” నేను మొదట సినిమా అవకాశాల కోసం డైరెక్టర్స్ దగ్గరకి వెళితే.. నేను అందంగా ఉండనని, నల్లగా ఉన్నానని, యాక్టింగ్ కి పనికిరాని అని అవమానించారు. అలా నడుస్తున్న క్రమంలో ఒక స్టార్ డైరెక్టర్ నాకు అవకాశం ఇస్తానని చెప్పారు. నేను వెంటనే ఓకే చెప్పాను.
ఆ తర్వాత నన్ను ఫొటోషూట్‌కు రమ్మని చెప్పాడు. ఫొటోషూట్ చేసి నన్ను పంపించేశారు. ఆ తరువాత అక్కడినుంచి నాకు పిలుపు రాలేదు. ఇక ఆ విషయం మర్చిపోయాను. కొన్నిరోజుల తరువాత నా ఫోటోలను మార్ఫింగ్ చేసి నెట్లో లీక్ చేశారు. ఆ ఫోటోలు నా జీవితంలో మచ్చలా మిగిలిపోయాయి. ఆ ఫోటోలు చూసి నన్ను , నా బంధువులు, స్నేహితులు అసహ్యించుకున్నారు. అయితే వాటిని వెబ్‌సైట్‌లో ఎవరూ పెట్టారనేది ఇప్పటికి నాకు తెలియదు. అలా నా జీవితంలో చేదు అనుభవాన్ని నేను ఎప్పుడు మర్చిపోలేను” అని చెప్పుకొచ్చింది