Colors Swathi: కలర్స్ అనే ప్రోగ్రాంతో పరిచయామయ్యి మంచి పేరు తెచ్చుకుంది స్వాతి. ఆ ప్రోగ్రాం తరువాత కలర్స్ స్వాతిగా మారిపోయిన అమ్మడు చిన్న చిన్న పాత్రలు చేస్తూ అష్టాచమ్మా చిత్రంతో హీరోయిన్ గా మారింది. మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్న స్వాతి ఆ తరువాత మంచి మంచి సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే ఫైలెట్ ను వివాహమాడిన స్వాతి కొన్నేళ్లు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఇక ఈ మధ్యనే స్వాతి రీ ఎంట్రీ ఇచ్చింది. పంచతంత్రం, మంత్ ఆఫ్ మధు, సత్య ఇలాంటి ప్రాజెక్ట్స్ లో నటించింది. ఇక ప్రస్తుతం మరికొన్ని సినిమాల్లో నటిస్తున్న ఈ బ్యూటీ .. భర్తతో విడిపోతుందని వార్తలు వచ్చాయి. భర్తకు, ఆమెకు పడడం లేదని, అందుకే వారు విడాకులు తీసుకుంటున్నారు అని పుకార్లు షికార్లు చేసాయి. కానీ, అందులో నిజం లేదని స్వాతి చెప్పుకురావడంతో ఆ పుకార్లకు చెక్ పడింది.
Samantha: సినిమాలకు గ్యాప్ ఇచ్చి.. ఆ పని చేస్తున్న సామ్ ..
ఇక తాజాగా స్వాతి తన సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేసింది. అందులో ఆమె బుర్ఖా వేసుకొని షాపింగ్ చేసినట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో బుర్ఖా ధరించి ట్రైన్ ఎక్కడమే కాకుండా ఎంచక్కా ఎవరికి తెలియకుండా జనాల మధ్యలో తిరుగుతూ ఎంజాయ్ చేసింది. ఇక దీనికి క్యాప్షన్ గా.. “ఒకవేళ కవర్ లచేసుకోకుండా బయటకు వెళ్తే.. ట్రబుల్స్ ఎదుర్కోవాల్సి వచ్చేది” అని చెప్పుకొచ్చింది. సాధారణంగా ప్రజల మధ్య సినీ సెలబ్రిటీలు తిరిగితే సెల్ఫీలు, వీడియోలు అంటూ విసిగిస్తారు అన్న విషయం తెల్సిందే. అందుకే ఆమె ఇలా బుర్ఖా వేసుకొని తిరిగింది. ఒకవేళ ఆమె కనిపిస్తే .. ఖచ్చితంగా మీడియా విడాకుల రూమర్స్ గురించి అడిగేవారే.. అందుకే బుర్ఖా వేసుకొని తప్పించుకోంది అంటూ అభిమానులు సరదాగా కామెంట్స్ పెడుతున్నారు.