Anushka:కన్నడ సినిమాలు ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంటున్నాయి. కెజిఎఫ్, విక్రాంత్ రోణ, చార్లీ లాంటి సినిమాలు ఇప్పటికే అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ లిస్ట్ లో కాంతారా వచ్చి చేరింది. కన్నడ హీరో రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి నటించిన ఈ సినిమా ఇటీవలే రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకోంది. సినిమా బావుండలే కానీ హీరోలతో, భాషలతో పనిలేదని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు నిరూపిస్తూనే ఉన్నారు. తాజాగా ఈ సినిమాను కూడా ప్రేక్షకులు అలానే ఆదరించారు. కెజిఎఫ్ లాంటి సినిమాను ప్రేక్షకులకు అందించిన హోంబలే ఫిల్మ్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కించారు.
ఇక ఇటీవలే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ సినిమాను రెండు సార్లు చూసినట్లు సోషల్ మీడియా ద్వారా చెప్పుకురావడంతో అభిమానులు మరింత జోరుపెంచారు. సినిమాలో రిషబ్ శెట్టి నటనకు ప్రభాస్ ఫిదా అయినట్లు చెప్పుకొచ్చాడు. ఇక తాజాగా ఈ సినిమాపై దేవసేన అనుష్క ప్రశంసల వర్షం కురిపించింది. సోషల్ మీడియా ద్వారా స్వీటీ ” కాంతారా సినిమా చూసాను.. ఎంతో బాగా నచ్చింది. రిషబ్ శెట్టి నటన అద్భుతం. టీమ్ అందరికి శుభాకాంక్షలు” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్లు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ప్రస్తుతం అనుష్క.. నవీన్ పోలిశెట్టితో ఒక సినిమా చేస్తోంది. త్వరలోనే ఈ సినిమా టైటిల్ ను మేకర్స్ రిలీజ్ చేయనున్నారు.