Srikanth Bharat : నటుడు శ్రీకాంత్ భరత్ మహాత్మాగాంధీ మీద చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అక్టోబర్ 02న గాంధీ జయంతి కావడం.. అదే రోజు దసరా రావడంపై సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు వెలిశాయి. దీంతో శ్రీకాంత్ కూడా ఇదే విషయంపై వివాదాస్పద కామెంట్లు చేశాడు. రెండు, మూడు వీడియోల్లో గాంధీని తిట్టడంతో కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంచు విష్ణును కలిసి శ్రీకాంత్ సభ్యత్వం రద్దు చేయాలంటూ ఫిర్యాదు చేశారు. దీంతో శ్రీకాంత్ స్పందించాడు.
Read Also : Rishab Shetty : జై హనుమాన్ సినిమాపై రిషబ్ క్లారిటీ.. రెండేళ్లు అంటూ..
తన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు తెలుపుతూ వీడియో రిలీజ్ చేశాడు. ‘నేను చేసిన వ్యాఖ్యలతో చాలా మంది బాధపడ్డారని తెలిసింది. వారందరినీ నేను క్షమించమని అడుగుతున్నాను. స్వాతంత్య్ర పోరాటంలో ఎంతో మంది ప్రాణాలు విడిచారు. వారందరినీ మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్ లో ఇలాంటివి మనల్ని విడదీయకుండా చూసుకుంటాను. మనమంతా కలిసి అభివృద్ధిలో ముందుకు సాగుదాం అంటూ శ్రీకాంత్ వీడియో రిలీజ్ చేశాడు. దీంతో ఈ వివాదం ఇక్కడితో ముగిసే అవకాశం ఉంది.
Read Also : Chiranjeevi : వీసీ సజ్జనార్ ను కలిసిని మెగాస్టార్ చిరంజీవి