Shine Tom Chacko : మళయాల నటుడు షైన్ టామ్ చాకోకు బెయిల్ మంజూరు అయింది. డ్రగ్స్ కేసులో కొన్ని గంటల క్రితమే ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అలా అరెస్ట్ అయిన కొన్ని గంటలకేకోర్టులో చాకోకు ఊరట లభించింది. కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో పోలీసులు ఆయన్ను విడుదల చేశారు. షైన్ టామ్ పై సహనటి విన్సీ రీసెంట్ గా సంచలన ఆరోపణలు చేసింది. డ్రగ్స్ మత్తులో తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడు అంటూ ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలు ఎదుర్కుంటున్న టైమ్ లోనే.. పోలీసులు ఈ నెల 16న ఓ డ్రగ్స్ కేసులో నిందితుడిని పట్టుకునేందుకు కొచ్చిలోని కలూర్ లో ఉన్న స్టార్ హోటల్ లో రైడ్ కోసం వెళ్లారు.
Read Also : L2 Empuraan : ఎల్-2 ఎంపురాన్ మరో రికార్డు
అయితే ఆ డ్రగ్స్ నిందితుడితో షైన్ టామ్ చాకో ఉన్నారు. పోలీసులు వస్తున్నారనే విషయం తెలుసుకుని కిటీకి నుంచి దూకి షైన్ టామ్ పారిపోయిన విజువల్స్ సీసీ కెమెరాల్లో చిక్కాయి. దీంతో పోలీసులు షైన్ టామ్ ను అదుపులోకి తీసుకుని విచారించారు. సదరు నిందితుడితో అతనికి పరిచయం ఉందని షైన్ టామ్ ఒప్పుకున్నారు. దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి కోర్టు ముందు హాజరుపరిచారు. కాగా కోర్టులో ఆయనకు ఊరట లభించింది. ప్రస్తుతం బెయిల్ పై బయటకు వచ్చారు. ఇక షైన టామ్ నుంచి శాంపిల్స్ సేకరించి డ్రగ్స్ టెస్ట్ కోసం ల్యాబ్ కు పంపించారు పోలీసులు. ఆ రిపోర్టు వస్తే షైన్ టామ్ డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనేది తేలిపోతుంది.