Rag Mayur : నా కెరీర్ చూసుకుంటే గర్వంగా అనిపిస్తుంది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న నటుల్లో రాగ్ మయూర్ ఒకరు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆయన..తన 2021 బ్లాక్‌బస్టర్ చిత్రం ‘సినిమా బండి’ ఈ శుక్రవారం (మే 15)తో ఐదేళ్లు పూర్తి చేసుకుంటుండటంపై ఆనందం వ్యక్తం చేశారు. ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు ప్రవీణ్ కండ్రేగులకు, నిర్మాతలు రాజ్ నిడిమోరు, కృష్ణ డి.కెలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. “నటుడిగా నేను కెరీర్ ప్రారంభించిన తొలి సినిమాకే మరిడేశ్ బాబు లాంటి అద్భుతమైన పాత్ర రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అంతకంటే మంచి డెబ్యూని నేను కోరుకోలేను. సినిమా బండి సినిమా నటుడిగా నాకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది” అని రాగ్ మయూర్ తెలిపారు. ఈ సినిమా విజయం తన కెరీర్లో కొత్త అధ్యాయానికి నాంది పలికిందని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.
రాగ్ మయూర్‌కు సినిమా బండి మూవీ మంచి బ్రేక్‌నిచ్చింది. ఆ తర్వాత ఆయన వీరాంజనేయులు విహారయాత్ర, కీడా కోలా, గాంధీతాతా చెట్టు వంటి చిత్రాల్లో నటించారు. ఈ చిత్రాలు ఆయన్ని యువతతో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌కు మరింత దగ్గర చేశాయి. ప్రముఖ హిందీ వెబ్ సిరీస్ ‘పంచాయత్’కు రీమేక్‌గా వచ్చిన ‘సివరాపల్లి’ నటుడిగా మొదటి నుంచి చివరి వరకు ఆయన ఓ ప్రాజెక్ట్‌ను మోయగలరని నిరూపించింది. ‘‘సివరాపల్లి’ సూపర్‌హిట్ తర్వాత నాకు మరింత ఆత్మ విశ్వాసం వచ్చింది. చాలా మంది దర్శకులు నన్ను దృష్టిలో పెట్టుకుని పాత్రలను రాశామని చెప్పారు. దర్శకులు నాకోసం ప్రత్యేకంగా పాత్రలు రాయటం అనేది నటుడిగా నాకు గొప్ప గుర్తింపు. నేను థియేటర్ ఆర్టిస్ట్ కావటంతో నటనలో విభిన్న కోణాలను అన్వేషించే అవకాశం దక్కింది. అది నా నటనను మరింత మెరుగు పరిచింది’’ అని రాగ్ మయూర్ తెలిపారు.
Also Read
- Manoj Manchu: మంచు మనోజ్ దంపతుల సంచలన నిర్ణయం.. ఐదుగురు పిల్లల దత్తత!
- Satish Kilaru: ‘పెద్ది’లో సుకుమార్ ఇన్వాల్వ్మెంట్..? లాస్ట్ డే డైరెక్టర్ బుచ్చిబాబు చాలా ఎమోషనల్ అయ్యారు!
- Satish Kilaru: ఒకటి కాదు ఏకంగా మూడు గాయాలు.. 'పెద్ది' షూటింగ్లో చరణ్‌కు ఏమైందో చెప్పిన నిర్మాత!
- Chiru Bobby 2 :మెగాస్టార్ కొత్త లుక్.. బాబీతో క్రేజీ మూవీ ముహూర్తం ఫిక్స్.!
డైరెక్టర్ గౌరి నాయుడు జమ్ము తెరకెక్కిస్తోన్న ‘గరివిడి లక్ష్మి’లో రాగ్ మయూర్ బుర్రకథ కళాకారుడిగా కనిపించబోతున్నారు. “ఇది చాలా ఎక్సైటింగ్‌తో పాటు ఛాలెంజింగ్ పాత్ర కూడా. ఈ పాత్ర కోసం ఎంతో ప్రిపేర్ అయ్యి నటించాను” అని ఆయన తెలిపారు. తన ఫిల్మోగ్రఫీపై గర్వంగా ఉందని చెప్పిన రాగ్ మయూర్, “నా కెరీర్ ప్రారంభ దశలోనే అగ్రశ్రేణి దర్శకులు, టెక్నీషియన్స్‌తో పని చేసే అవకాశం రావడం నా అదృష్టం. ఎమోషన్స్, రియలిస్టిక్ కథనాలకు ప్రాధాన్యం ఉన్న సినిమాల్లో నటించాలని ఎప్పటినుంచో కోరుకున్నాను,” అని అన్నారు.
తాజావార్తలు
-
Chickens Die: ఘోర ఘటన.. 3 గంటల్లో 5,300 కోళ్లు మృతి.. కారణం ఏంటంటే..
-
Pichi Potta Chicken : నోరూరించే ‘పిచి పొట్టా చికెన్’.. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో ఇలా ఈజీగా చేసుకోండి.!
-
Manoj Manchu: మంచు మనోజ్ దంపతుల సంచలన నిర్ణయం.. ఐదుగురు పిల్లల దత్తత!
-
Venkatesh Iyer: తమిళనాడు సీఎం విజయ్ స్టైల్‌ను దించేసిన వెంకటేశ్ అయ్యర్..
-
PM Modi: స్వీడన్లో మోడీకి ఘన స్వాగతం.. గ్రిపెన్ ఫైటర్ జెట్ల ఎస్కార్ట్ వైరల్
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..