Actor Pradeep Wife Saraswathi Completes PHD on Telugu Serials: ప్రముఖ సినీ, టీవీ నటుడు ప్రదీప్ భార్య సరస్వతి ప్రదీప్ అరుదైన ఘనత సాధించిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. తెలుగులో తొలితరం వ్యాఖ్యాత, నటి సరస్వతి ప్రదీప్, ఉస్మానియా విశ్వవిద్యాలయం ద్వారా తాజాగా PhD పట్టా పొందారు. “ తెలుగు సీరియళ్ళు – వస్తు పరిశీలన” అనే అంశం మీద ప్రొఫెసర్ వారిజా రాణి పర్యవేక్షణలో సరస్వతి ప్రదీప్ పరిశోధన చేసినట్టు సమాచారం. మన లాక్షణికులు అందించిన కథా లక్షణాలు, నవలా లక్షణాలు, నాటక లక్షణాలను ప్రాతిపదికగా తీసుకుని తెలుగు సాహిత్య రంగంలో ఎందరో రచయితలు విశేషమైన రచనలు చేస్తున్నారు కానీ రచన రూపంలోని కథ సీరియల్ కథగా దృశ్యరూపంలోకి మారినపుడు, జరిగే మార్పుల వలన కొత్త లక్షణాలను సంతరించుకుంటుందమొ వెల్లడించారు.
Varun Tej Lavanya Tripathi : వరుణ్ తేజ్, లావణ్య పెళ్లికి వెళ్లేవాళ్లు ఈ బట్టలే ధరించాలట!
33 సంవత్సరాలుగా తనకు తెలుగు టీవీ రంగంతో యాంకర్ గా, నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా ఉన్న అనుభవంతో, తొలిసారిగా ఈ గ్రంధంలో సీరియల్ కథకు ఉండే లక్షణాలను విశ్లేషించారు సరస్వతి ప్రదీప్. విశేషమేమిటంటే, ఆమె తండ్రి అనంత కృష్ణ చదువుకు లేదు వయసు అని పదవీ విరమణ తర్వాత సంస్కృతంలో PhD పట్టా పొందగా వారిని స్ఫూర్తిగా తీసుకున్నాననే సరస్వతి పరిశోధన, తన మనవరాలి అక్షరాభ్యాసం ఒకే కాలంలో జరగడం విశేషం. ఇక అంతేగా, అంతేగా.. అంటూ ఒక్క డైలాగ్‌తో ఎఫ్2, ఎఫ్ 3లలో అలరించిన నటుడు ప్రదీప్ గతంలో హీరోగా అనేక సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా ప్రదీప్ అనేక సినిమాల్లో నటించారు.