Devan : ఈ మధ్య ఐస్ క్రీమ్ తిన్నా సరే చాలా మంది అది పడక చనిపోతున్నారు. ఇలాంటి ఘటనలు గతంలో చాలానే జరిగాయి. ఓ నటుడి భార్య కూడా ఇలాగే చనిపోయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపాడు. ఆయన ఎవరో కాదు మలయాళ నటుడు దేవన్. ఆయన తెలుగులో దేశ ముదురు, సాహో, హార్ట్ ఎటాక్, ఏ మాయ చేశావే, మా అన్నయ్య లాంటి సినిమాల్లో విలన్ గా నటించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దేవన్ తన భార్యను తలుచుకుని ఎమోషనల్ అయ్యాడు. ఆయన భార్య చనిపోయి ఇప్పటికి ఆరేళ్లు అవుతోంది.
Read Also : Pawan Kalyan : ఇండస్ట్రీ హిట్ మూవీని మిస్ చేసుకున్న పవన్ కల్యాణ్..
ఈ సందర్భంగా ఆయన తన భార్య ఎలా చనిపోయిందో వివరించారు. నా భార్యకు ఐస్ క్రీమ్ అంటే పడదు. ఆమెకు అలర్జీ. చెన్నలో ఉన్నప్పుడు ఒకసారి ఐస్ క్రీమ్ తింటే తనకు ఊపిరి ఆడలేదు. డాక్టర్ దగ్గరకు వెళ్తే.. జీవితంలో ఐస్ క్రీమ్ తినొద్దని చెప్పాడు. ఆమెకు ఊపిరితిత్తుల్లో అలర్జీ వస్తోందని చెప్పారు. చాలా రోజులు ఆమె ఐస్ క్రీమ్ కు దూరంగా ఉంది. ఓ సారి నా కూతురు లక్ష్మీ మా ఇంటికి వచ్చినప్పుడు తన పిల్లల కోసం ఐస్ క్రీమ్స్ తెచ్చి ఇంట్లో పెట్టింది. అందులో కొన్ని మా ఇంట్లోనే మర్చిపోయి వెళ్లింది. నేను బయట ఉన్నప్పుడు నా భార్య డాక్టర్ చెప్పింది మర్చిపోయి ఐస్ క్రీమ్ తిన్నది. ఊపిరి సమస్య రావడంతో పని వాళ్లు నాకు ఫోన్ చేశారు. నేను వెళ్లేసరికి ఆమె క్రిటికల్ పొజీషన్ లో ఉంది. హాస్పిటల్ కు వెళ్లినా ఆమె బతకలేదు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.
Read Also : JR NTR : జూనియర్ ఎన్టీఆర్ ఆ సినిమా చేసి ఉంటే మరోలా ఉండేదేమో..