JR NTR : జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు వరుసగా పెద్ద సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. వార్-2 డిజాస్టర్ అయినా.. ప్రశాంత్ నీల్ తో చేస్తున్న సినిమాపైనే భారీ అంచనాలు ఉన్నాయి. ఆ తర్వాత దేవర-2 కూడా లైన్ లో ఉంది. ఇలా వరుసగా సినిమాలతో దూసుకుపోతున్న ఎన్టీఆర్ కు.. కంటెంట్ మీద మంచి గ్రిప్ ఉంది. ఎలాంటి కథలు ఆడుతాయో ఎన్టీఆర్ కు బాగా తెలుసు. కొన్ని సార్లు అది ప్లాప్ కూడా అవుతుందనుకోండి. అయితే ఎన్టీఆర్ అప్పట్లో ఓ బ్లాక్ బస్టర్ సినిమాను వదులుకున్నాడు. అదేదో కాదు.. రవితేజ హీరోగా చేసిన భద్ర. బోయపాటి శ్రీను ఈ సినిమాతోనే డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఈ కథను ముందుగా ఎన్టీఆర్ కు వినిపించాడంట బోయపాటి శ్రీను.
Read Also : Allu Arjun : బన్నీ చేసిన పని.. విజయ్ కు కెరీర్ ను మార్చేసిందంట..
కానీ బోయపాటి కథ చెప్పే విధానం చూసిన ఎన్టీఆర్ కు.. ఎందుకో అంతగా ఎక్కలేదు. మనకెందుకులే అని లైట్ తీసుకున్నాడు. అదే కథతో రవితేజ బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఈ విషయాన్ని గతంలో ఎన్టీఆర్ స్వయంగా చెప్పాడు. ఎందుకో బోయపాటి కథ చెప్పిన విధానంతోనే నేను లైట్ తీసుకున్నాను. ప్రతి సీన్ ను.. మీద మీదకు వస్తూ చెప్పడం.. యాక్షన్ సీన్లను లీనమైపోయి చెప్పడంతోనే వద్దనుకున్నట్టు చెప్పాడు. ఒకవేళ అదే కథను గనక ఎన్టీఆర్ అప్పట్లో చేసి ఉంటే.. అప్పట్లోనే ఆయన మార్కెట్ మరింత పెరిగి ఉండేదేమో. ఎందుకంటే భద్ర సినిమా రవితేజ కెరీర్ లో ఓ మైల్ స్టోన్ గా నిలిచిపోయింది. మరి నట విశ్వరూపం చూపించే ఎన్టీఆర్ కూడా ఇందులో నటించి ఉంటే.. ఆయన క్రేజ్ వేరే లెవల్ లో ఉండేదేమో అంటున్నారు ఫ్యాన్స్. ఇదే బోయపాటితో దమ్ము సినిమా చేస్తే అది డిజాస్టర్ అయింది.
Read Also : OG : ప్రమోషన్లకు పవన్ దూరంగా ఉంటాడా.. అసలు కారణం అదే..