Actor Chandu Suicide after Pavitra Jayaram Death: సీరియల్ నటి పవిత్ర జయరాం ఆక్సిడెంట్ కేసులో ఒక పెద్ద ట్విస్ట్ చోటుచేసుకుంది. ఆమె భర్తగా ప్రచారం జరుగుతున్న ప్రియుడు చందు సూసైడ్ చేసుకునే మరణించాడు. మణికొండలోని తన నివాసంలో అతను సూసైడ్ చేసుకున్నట్టు వెలుగులోకి వచ్చింది. ఇవాళ పవిత్ర పుట్టినరోజు పవిత్ర రమ్మంటుంది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన చందు ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. పవిత్ర మరణం తర్వాత ఒక యుట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు బ్రెయిన్ వ్యాధి ఉందని చనిపోతానేమోనని చందు వ్యాఖ్యానించాడు.
Suriya: కొత్త వివాదంలో హీరో సూర్య.. అసలేమైందంటే?
ఇక చందుకి పవిత్ర కంటే ముందు 2015లో శిల్ప అనే యువతీతో వివాహం జరిగినట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత పవిత్రకు దగ్గరైన తర్వాత శిల్పకు దూరంగా ఉంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ రోజు పవిత్ర పుట్టినరోజు..నిన్ను మర్చిపోలేక పోతున్నా, మన జిమ్ కోచ్ కాల్ చేస్తున్నాడు.. జిమ్ వెళ్దాం అని పోస్ట్ లు పెట్టిన చందు ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. పవిత్రతో గత కొంతకాలం నుంచి సహజీవనం చేస్తున్న చందు త్వరలోనే వివాహం కూడా చేసుకోవాలని భావించినట్లుగా చెబుతున్నారు. ఐదు రోజుల క్రితం మహబూబ్నగర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి చెందింది. బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా రోడ్డు ప్రమాదంలో పవిత్ర రోడ్డు ప్రమాదంలో మరణించింది. అదే కారులో ప్రయాణిస్తున్న చందు కి స్వల్ప గాయాలయ్యాయి.
త్రినయనితో పాటు పలు సీరియల్స్ లో చందూ నటించాడు. పవిత్ర కంటే ముందే శిల్పతో చందు కి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్లు చెబుతున్నారు. ఆరేళ్లుగా చందుకు టీవీ నటి పవిత్ర జయరాంతో వివాహేతర సంబంధం ఉందని అంటున్నారు. రాధమ్మ పెళ్లి, కార్తీక దీపం సీరియల్స్ లో నటిస్తున్న చందు ఆత్మహత్య చేసుకుని చనిపోవడంతో ఇప్పుడు ఆత్మహత్యకు గల కారణాలను పోలీసులు విచారిస్తున్నారు. అయితే ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి కానీ ఎలా జరిగింది? ఎలా చనిపోయాడు అనే విషయం మీద మాత్రం పూర్తి అవగాహన ఇంకా లేదు.