Amala Paul: కోలీవుడ్ హీరోయిన్ అమలా పాల్ పోలీసులను ఆశ్రయించింది. గత కొన్నిరోజులుగా తన మాజీ ప్రియుడు తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ చెన్నై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే.. కోలీవుడ్ హీరోయిన్ అమలా పాల్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారడమే కాకుండా మరోపక్క నిర్మాతగాను వ్యవహరిస్తోంది. ఇక ఆమె పర్సనల్ విషయానికొస్తే డైరెక్టర్ విజయ్ ను పెళ్లాడిన ఆమె రెండేళ్లు కూడా తిరగకముందే విడాకులు తీసుకొని షాక్ ఇచ్చింది. ఇటీవలే ఈ ముద్దుగుమ్మ భవీంధర్ సింగ్ అనే వ్యక్తితో ప్రేమాయణం మొదలుపెట్టింది. 2018లో ఒక సినిమా నిర్మాణంలో పరిచయమైన ఈ జంట కొన్నేళ్లు వరుస సినిమాలకు నిర్మాతలుగా వ్యవహరించారు.
ఇక నిర్మాణ లావాదేవీల్లో విబేధాలు రావడంత అతడికి అమలా దూరంగా ఉంటూ వస్తోంది. ఇక ఈ నేపథ్యంలోనే భవీంధర్ సింగ్ తనను బెదిరిస్తున్నాడని అమలా పాల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు కావాల్సిన డబ్బును ఇవ్వాలని, తన మాట విని అతను చెప్పినట్లు చేయమని అంటున్నాడని, చేయని యెడల అతనివద్ద ఉన్న ప్రైవేట్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరిస్తునట్లు అమలా పిటిషన్ లో పేర్కొంది. ఇక అమలా ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు పవీంధర్ సింగ్ పై చీటింగ్ కేసు నమోదు చేసి అతడికోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఈ వార్త కోలీవుడ్ లో సంచలనంగా మారింది.