Abhai Naveen : కథ పట్టుకెళ్తే గ్లామర్ కావాలంటారు.. హీరోయిన్ల గుట్టు విప్పిన బిగ్ బాస్ అభయ్ నవీన్!

Abhai Naveen

Abhai Naveen

సినిమాల్లో మహిళా పాత్రలకు ప్రాధాన్యత పెరగాలని, కేవలం గ్లామర్ బొమ్మల్లా కాకుండా కథను నడిపించే పవర్‌ఫుల్ క్యారెక్టర్లు రాయాలని చాలామంది మేధావులు ఇండస్ట్రీ వర్గాలని కోరుతూ ఉంటాయి. కానీ, ప్రాక్టికల్‌గా పరిస్థితి ఎలా ఉందో కళ్లకు కడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు నటుడు అభయ్ నవీన్. రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాలో జాన్వీ కపూర్ క్యారెక్టర్ ప్రెజెంటేషన్ పై ఒకవైపు దర్శకుడు బుచ్చిబాబు క్షమాపణలు చెప్పి సీన్లు ట్రిమ్ చేసినా.. ఇంకా ఇండస్ట్రీలో హీరోయిన్ల ఓరియెంటేషన్ పై చర్చ సాగుతూనే ఉంది. ఈ తరుణంలోనే అభయ్ నవీన్ షేర్ చేసిన ఈ ఇంటర్నల్ మ్యాటర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

“నాకు అవార్డులు వద్దు.. గ్లామర్ రోల్స్ కావాలి!”
తనకు ఎదురైన మైండ్ బ్లాకింగ్ ఇన్సిడెంట్ గురించి అభయ్ నవీన్ రాస్తూ.. “ఒక నెల కిందట ఒక లీడ్ రోల్ (హీరోయిన్) కోసం నేను ఒక అమ్మాయిని అప్రోచ్ అయ్యాను. ఆమెకు కథ మొత్తం వినిపించాక ఏమన్నదో తెలుసా..? ‘నాకు ఇలాంటి పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ చేసి, అవార్డులు తెచ్చుకోవాలనే ఇంట్రెస్ట్ అస్సలు లేదు. నాకు కేవలం గ్లామర్ రోల్స్ మాత్రమే కావాలి’ అని ముఖం మీదే చెప్పేసింది. ఆ మాట వినగానే నాకు దెబ్బకు మైండ్ మింగేసింది” అంటూ తన ఆవేదనను, ఆశ్చర్యాన్ని పంచుకున్నారు. పైకి మాత్రం ‘మంచి ఫిమేల్ క్యారెక్టర్స్ రాయండి’ అని అంటారు కానీ, నిజంగా ఏదైనా మంచి కథ తీసుకొని వారి దగ్గరకు వెళ్తే.. కథ వినడానికి కంటే ముందే ఈ మూడు ప్రశ్నలే అడుగుతారని ఆయన చెప్పుకొచ్చారు.

×
×
Ad

సినిమాలో హీరో ఎవరు? ఈ చిత్రానికి ప్రొడ్యూసర్ ఎవరు? నా రెమ్యూనరేషన్ ఇంత.. ఇవ్వగలరా? “నేను కలిసిన కొందరు హీరోయిన్లతో జరిగిన మాట ముచ్చట ఇది. పైన చెప్పిన ఆ మూడు విషయాలు (హీరో, ప్రొడ్యూసర్, రెమ్యూనరేషన్) అన్నీ పక్కాగా సెట్ అయిన తర్వాతే.. ఇక తప్పదు కదా అన్నట్లు ఒక ఫార్మాలిటీ కోసం మాత్రమే కథ ఏంటో చెప్పమని అడుగుతారు” అని అభయ్ నవీన్ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ‘పెద్ది’ సినిమాలో హీరోయిన్ పాత్ర ట్రాక్ వల్ల నెగెటివిటీ రావడం, దానికి కౌంటర్‌గా అనసూయ లాంటి వాళ్లు ‘క్రియేటివ్ ఫ్రీడమ్ వర్సెస్ సామాజిక బాధ్యత’ అంటూ పోస్ట్‌లు పెడుతున్న టైంలో అభయ్ నవీన్ ఈ విషయాన్ని బయటపెట్టడం పర్ఫెక్ట్ టైమింగ్ అని నెటిజన్లు అంటున్నారు.