Aamir Khan: ఆమిర్ ఖాన్ కు వెయ్యి కోట్ల క్లబ్ లో రెండు సినిమాలున్నాయని ఘనంగా చెప్పుకుంటున్నా, ఆయనకు కూడా ఐదు సంవత్సరాల నుంచీ సరైన సక్సెస్ లేదు. ఆమిర్ నటించి, నిర్మించిన ‘సీక్రెట్ సూపర్ స్టార్’ దాదాపు వేయి కోట్లకు దగ్గరలోకి వెళ్ళింది. ఆ సినిమాకు ఆయన పెట్టిన ఖర్చు రూ.25 కోట్లు మించి ఉండదనీ అంటున్నారు. అంటే పెట్టుబడి కంటే దాదాపు 39 రెట్ల ఆదాయాన్ని ‘సీక్రెట్ సూపర్ స్టార్’ చూసిందన్న మాట! ఈ నిష్పత్తిలో ఏ సినిమా కూడా ఇంతటి ఘనవిజయం సాధించలేదనీ బాలీవుడ్ జనం విశ్లేషిస్తున్నారు. అదలా ఉంచితే గత సంవత్సరం ఆమిర్ ఖాన్ ఎంతో ఇష్టపడి, కష్టపడి నటించిన ‘లాల్ సింగ్ చద్దా’ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. దాంతో పాటు నటి రేవతి కోరిక మేరకు ఆమె రూపొందించిన ‘సలామ్ వెంకీ’లో అతిథి పాత్రలో కనిపించారు ఆమిర్. ఆ సినిమా కూడా ఒరగబెట్టింది ఏమీ లేదు. ప్రస్తుతం ఆమిర్ ఖాన్ నటించే ఏ సినిమా సెట్స్ పై లేదు. అందువల్ల మళ్ళీ అందరినీ ఆకట్టుకొనేలా ఓ సినిమా తీసేందుకు ఆమిర్ సన్నాహాలు చేస్తున్నారట!
Shah Rukh Khan: షారుఖ్ చెప్పిన ‘కర్మ’ సిద్ధాంతం!
ఆమిర్ ఖాన్ 2007లో నటించి, నిర్మించి, స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ‘తారే జమీన్ పర్’ను ఎన్నటికీ మరచిపోలేనిది అంటారు. ఈ సినిమా కూడా రూ.12 కోట్లతో నిర్మిస్తే, దాదాపు వంద కోట్లు పోగేసింది. అందువల్ల ఆమిర్ ఖాన్ ఇప్పుడు కూడా ‘చిన్నచిత్రమే చింతలు లేని చిత్రం’ అనే సూత్రాన్ని నమ్ముతున్నారని భోగట్టా! తన ‘సీక్రెట్ సూపర్ స్టార్’ డైరెక్టర్ అద్వైత్ చందన్ కు ‘తారే జమీన్ పర్’ లాంటి విద్యావ్యవస్థ నేపథ్యం ఉన్న కథను చూడమని ఆమిర్ పురమాయించాడట! ఆ పనిమీదే అద్వైత్ ఉన్నట్టు సమాచారం. వందల కోట్ల రూపాయలు వెదజల్లి, వేయి కోట్లు పోగేయడం గొప్ప కాదని ఆమిర్ అంటున్నారు. అందువల్ల తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు చూడడంలోనే అసలు మజా ఉందని ఆమిర్ భావన! మరి ఈ సారి ఆమిర్ ఖాన్ ఏ కథతో ముందుకు వస్తారో? ఎంత పెట్టుబడి పెడతారో? ఏ స్థాయి సక్సెస్ సాధిస్తారో చూడాలని ముంబై సినీజనం కూడా ఆసక్తిగా ఉన్నారు.
Prithvi Show Issue: పృథ్వీ షా గొడవలో కొత్త ట్విస్ట్.. రివర్స్‌లో కేసు పెట్టిన సప్నా గిల్