రాజీవ్ సాలూరి, దీప ప్రధాన పాత్రలలో 11న ఓ కొత్త చిత్రం మొదలు పెడుతున్నారు నిర్మాత, దర్శకుడు సి వి రెడ్డి. దాదాపు ఎనిమిదేళ్ళ తర్వాత సీవీ ఆర్ట్స్ పై ఈ సినిమా నిర్మిస్తున్నారాయన. కరోనా కాలంలో కథను రెడీ చేసిన సీవీ రెడ్డి దీనికి ‘ఆఖరి ముద్దు’ అన్న పేరు నిర్ణయించారు. కథ తనని బాగా ప్రభావితం చేసిందని, సమాజానికి మార్గదర్శకం కావాలనే ఉద్దేశ్యం తో ఈ సినిమా తీస్తున్నానంటున్నారు. గతంలో సీవీ రెడ్డి తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో పలు చిత్రాలు నిర్మించారు. ‘బదిలి’కి నంది అవార్డు కూడా అందుకున్నారు.
‘పెళ్లిగోల, విజయరామరాజు, శ్వేత నాగు, ఆడుతూ పడుతూ’ వంటి హిట్ చిత్రాలను నిర్మించమే కాదు… నేషనల్ ఫిలిం అవార్డ్స్, ఇండియన్ పనోరమా కమిటీ మెంబర్ గాను, ఆస్కార్ కమిటీ కి చైర్మన్ గా కూడా సేవలందించారు. ‘ఆఖరి ముద్దు’ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, మాటలతో పాటు, దర్శకత్వం వహిస్తూ తానే స్వయంగా నిర్మిస్తున్నారు.సీత కాకరాల, పవిత్ర లోకేష్, పోసాని ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు కోటి సంగీతం అందిస్తున్నారు.