సుధీర్ బాబు హీరోగా భవ్య క్రియేషన్స్ పతాకంపై హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కుతోంది. మహేష్ దర్శకత్వంలో వి. ఆనంద ప్రసాద్ దీనిని నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి రెండో వారంలో పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభమైంది. మంగళవారం హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేశారు. ఈ సందర్భంగా నిర్మాత వి. ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ “సుధీర్ బాబు హీరోగా ‘శమంతకమణి’ తర్వాత మా సంస్థలో చేస్తున్న చిత్రమిది. ఏప్రిల్ 23 వరకూ ఈ షెడ్యూల్ కొనసాగుతుంది. ఇందులో…
ఉప్పెన చిత్రంతో తెలుగు నాట అడుగుపెట్టింది కృతి శెట్టి. ఈ సినిమా విజయంతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారడంతో పాటు వరుస సినిమాలను చేజిక్కించుకొని విజయాలను మూట కట్టుకొంటుంది. ఇక ప్రస్తుతం రామ్ సరసన ది వారియర్ చిత్రంలో నటిస్తున్న ఈ భామ కోలీవుడ్ లో బంఫర్ ఆఫర్ అందుకుంది. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య- సెన్సేషనల్ డైరెక్టర్ బాలా కాంబోలో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. నేడు ఈ సినిమా షూటింగ్…
నూతన తారలు గౌతమ్ రాజ్ , సాయి విక్రాంత్ హీరోలుగా , మధుప్రియ, లావణ్య శర్మ, సిరి మరియు అంబిక హీరోయిన్స్ గా పానుగంటి మహంకాలమ్మ, యాదయ్య గౌడ్ సమర్పణలో మానస క్రియేషన్స్ పతాకంపై టి.డి.ప్రసాద్ వర్మ దర్శకత్వంలో బృందాకర్ గౌడ్ నిర్మిస్తోన్న చిత్రం “అమ్మ నాన్న మధ్యలో మధురవాణి”. ఈ చిత్రం మార్చి 28న హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ఆత్మీయ అతిథుల మధ్య ఘనంగా ప్రారంభమైంది. పూజా కార్యక్రమాల అనంతరం హీరో, హీరోయిన్స్ పై చిత్రీకరించిన…
బహుభాషా నటుడు ప్రకాశ్ రాజ్ నిత్యం క్షణం తీరిక లేకుండా ఉంటారు. ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేను కలిసిన బృందంలో ప్రకాశ్ రాజ్ కూడా ఉన్నారు. ఆ తర్వాత రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తో కలిసి తెలంగాణాలోని కొన్ని నీటిపారుదల ప్రాజెక్ట్స్ ను ప్రకాశ్ రాజ్ సందర్శించారు. ఇదే సమయంలో ఆయన నటన, చిత్ర నిర్మాణాన్ని కూడా కొనసాగిస్తున్నారు. ఇటీవలే ప్రకాశ్‌రాజు, నవీన్‌చంద్ర, కార్తీక్ రత్నం, వాణీబోజన్,…
వాసం నరేశ్, ఆశ ప్రమీల హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్న చిత్రం ‘ప్యాకప్’. జివిఎస్ ప్రణీల్ దర్శకత్వంలో పానుగంటి శరత్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీని ప్రారంభోత్సవం సోమవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత ఎ. ఎమ్. రత్నం ముఖ్య అతిథిగా హాజరై హీరోహీరోయిన్లపై క్లాప్ కొట్టి చిత్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఈ చిత్రం మంచి విజయం సాధించి, యూనిట్‌కు మంచి పేరు తీసుకురావాల’ని ఆకాంక్షించారు. ఓ మంచి కథతో హీరోగా…
ఇప్పటి వరకూ గ్లామ్ పాత్రలకు పరిమితమైన తమన్నా తొలిసారి ఓ బౌన్సర్ పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాను ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ మాధుర్ బండార్కర్ దర్శకత్వంలో ఫాక్స్ స్టార్ స్డూడియో నిర్మిస్తుండటం విశేషం. ఈ సినిమా షూటింగ్ శుక్రవారం ఆరంభం అయింది. 'చాందినీ బార్', 'ఫ్యాషన్' వంటి చిత్రాలతో ప్రశంసలతో పాటు పలు అవార్డులు గెలుచుకున్న ఫిల్మ్ మేకర్ మధుర్ భండార్కర్. ఇందులో తమన్నా డి-గ్లామ్ లుక్ లో కనిపించనుంది. షూటింగ్ స్పాట్ నుండి దర్శకుడితో దిగిన…
కిరణ్ లోవ, లక్ష్మీ కిరణ్, హరీష్ బొంపల్లి, మంజీర ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం ‘ఒ.సి.’. విష్ణు శరణ్ బొంపల్లి దీనికి నిర్మాత. కిరణ్ – విష్ణు దర్శకులు. ఈ సినిమా ప్రారంభోత్సవం బుధవారం హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ దర్శకుడు వి. వి. వినాయక్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ నివ్వగా, మునిరాజ్ గుత్తా కెమెరా స్విచ్ఛాన్ చేశారు. సత్య మాస్టర్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా కిరణ్…
గత యేడాది దసరా సందర్భంగా నాని కొత్త సినిమా ‘దసరా’కు సంబంధించిన ప్రకటనతో పాటు ఓ గ్లింప్స్ విడుదలైంది. నేచురల్ స్టార్ నాని సరసన జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేశ్ నటించబోతున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలతో బుధవారం మొదలైంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్‌వీసీ) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. గోదావరి ఖనిలోని బొగ్గు గనుల నేపథ్యంలో తెరకెక్కబోతున్న మాస్ ఎంటర్ టైనర్…
రాజీవ్ సాలూరి, దీప ప్రధాన పాత్రలలో 11న ఓ కొత్త చిత్రం మొదలు పెడుతున్నారు నిర్మాత, దర్శకుడు సి వి రెడ్డి. దాదాపు ఎనిమిదేళ్ళ తర్వాత సీవీ ఆర్ట్స్ పై ఈ సినిమా నిర్మిస్తున్నారాయన. కరోనా కాలంలో కథను రెడీ చేసిన సీవీ రెడ్డి దీనికి ‘ఆఖరి ముద్దు’ అన్న పేరు నిర్ణయించారు. కథ తనని బాగా ప్రభావితం చేసిందని, సమాజానికి మార్గదర్శకం కావాలనే ఉద్దేశ్యం తో ఈ సినిమా తీస్తున్నానంటున్నారు. గతంలో సీవీ రెడ్డి తెలుగు,…