అనుపమ పరమేశ్వరన్.. ఈ నటి ప్రేమమ్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది.ఈమె తెలుగు తమిళ భాషలలో వరుస సినిమాలలో నటిస్తూ మంచి గుర్తింపు ను సాధించింది.ఇక గత ఏడాది ఈమె నటించిన కార్తికేయ 2 సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోయిన్ గా మంచి గుర్తింపు ను పొందింది.. ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బాగా బిజీగా ఉన్న ఈమె తాజాగా భావోద్వేగాలను వ్యక్తపరిచే విషయం గురించి పలు వ్యాఖ్యలు చేసింది.
భావోద్వేగాలను వ్యక్తపరిచే విషయంలో మీరు ఏ విధంగా ఆలోచిస్తారు అంటూ తనకు ఒక ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు ఈమె సమాధానం చెబుతూ..తాను భావోద్వేగాలను బయటపెట్టే విషయంలో ఎంతో నిజాయితీగా ఉంటానని తెలిపారు. ఒక పని తనకు నచ్చకపోతే నచ్చలేదని షూటిగా చెప్పేస్తానని అయితే ఆ విషయాన్ని అంతటితో నేను మరిచిపోతాను అంటూ చెప్పుకొచ్చింది. ఇలాంటి విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి మన సమయం వేస్ట్ చేసుకోవడం తప్ప ఏమి ఉండదని తెలిపారు. మన జీవితం చిన్నది.ఈ జీవితంలో మనం కొద్ది రోజులు ఇక్కడ నివసించి మనకు ఇష్టం వచ్చిన విధంగా నటిస్తూ తిరిగి ఏదో ఒక రోజు వెళ్లిపోయే వాళ్ళమని కూడా తెలిపారు. అయితే ఆరోజు ఎప్పుడు వస్తుందనేది మాత్రం ఎవరికీ కూడా తెలియదు. అందుకే బ్రతికున్న రోజులు ఎంతో మంచిగా ఎలాంటి ఒత్తిడి లేని జీవితాన్ని గడపాలని నేను అనుకుంటానని అనుపమ వెల్లడించింది.. సీసీటీవీ ఫుటేజ్ కూడా నెల రోజుల లోపు ఆటోమేటిక్ గా డిలీట్ అయిపోతుంది..అలాగే నా మైండ్ లో ఉన్నటువంటి చెత్తను కూడా ఎప్పటికప్పుడు నేను డిలీట్ చేస్తూ ఉంటానని ఈ సందర్భంగా ఆమె చేసిన కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి.ప్రస్తుతం అనుపమ వరుస సినిమాలతో చాలా బిజీ గా వుంది. అప్పుడప్పుడు సోషల్ మీడియా లో తనకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది.