త్రివిక్రమ్ అనగానే హీరో నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుల వరకూ ప్రాసతో చెప్పే డైలాగులు గుర్తొస్తాయి. ఆయన సినిమాలు చూస్తే ఒక గురూజీ శిష్యులకి పాఠాలు చెప్పినట్లు అనిపిస్తుంది. మాటల మాంత్రికుడుగా పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ కలం పదును చాలా ఎక్కువ. త్రివిక్రమ్ కి డైలాగులు రాయడమే కాదు, క్రికెట్ ఆడడం కూడా వచ్చు అని చెప్తూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. షూటింగ్ అనగానే ఆర్టిస్టుల హడావుడి, గందరగోళం, టెన్షన్, షాట్ ఎలా వస్తుందో అనే భయం ఇలా చాలా ఎమోషన్స్ ని క్యారీ చేస్తూ ఉంటాడు డైరెక్టర్. అలాంటి టైట్ సిట్యువేషన్ లో కూడా కూల్ గా క్రికెట్ ఆడుతున్నాడు త్రివిక్రమ్. SSMB 28 సెట్స్ లో, షూటింగ్ గ్యాప్ లో ఆర్టిస్టులతో కలిసి త్రివిక్రమ్ క్రికెట్ ఆడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఎలాంటి టెన్షన్ లేకుండా త్రివిక్రమ్ చాలా కూల్ అండ్ కామ్ గా తన ఫ్రీ టైంని ఎంజాయ్ చేస్తున్నట్లు ఉంది ఆ వీడియో చూస్తే. ఇది ఒక అదిరిపోయే సీన్ తీసిన తర్వాత వచ్చిన ప్రశాంతతనా లేక ఒక తుఫాన్ వచ్చే ముందు ఉండే నిశబ్దమా అనేది తెలియదు కానీ త్రివిక్రమ్ బాట్ పట్టుకోని హ్యాపీగా ఆడుకుంటున్నాడు.
ఇక SSMB 28 గురించి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడుతూ… అతడు సినిమా చూసినప్పటి నుంచి త్రివిక్రమ్, మహేశ్ బాబు కాంబినేషన్ లో సినిమా వస్తే దానికి తను మ్యూజిక్ చెయ్యాలని వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇద్దరితో సెపరేట్ గా వర్క్ చేశాను కానీ కాంబినేషన్ లో వర్క్ చెయ్యడం డ్రీం కమ్ ట్రూ లాంటిది. ఈ సినిమాకి ది బెస్ట్ ఆల్బమ్ ఇస్తాను అని చెప్పాడు. తమన్ ప్రస్తుతం ఉన్న ఫామ్ ని బట్టి చూస్తే, అతను నార్మల్ గా కొడితేనే మ్యూజిక్ అదిరిపోతుంది. ఇక ది బెస్ట్ ఇస్తాను అన్నాడు అంటే ఘట్టమనేని అభిమానులకి పండగే. ఇదిలా ఉంటే SSMB 28 సినిమా డిజిటల్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ 80 కోట్లకి సొంతం చేసుకుందని, నైజాం హక్కులని దిల్ రాజు 50 కోట్లు పెట్టి రైట్స్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు అనే వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అఫీషియల్ గా ఎవరి నుంచి ఎలాంటి కన్ఫర్మేషన్ రాలేదు కానీ SSMB 28 ప్రీరిలీజ్ బిజినెస్ మాత్రం ఇప్పటివరకూ ఏ ఒక్క తెలుగు రీజనల్ సినిమాకి జరగని రేంజులో ఉంటుంది అనేది మాత్రం గ్యారెంటీ.
https://twitter.com/Nikhil_Prince01/status/1620769384829689860