త్రివిక్రమ్ అనగానే హీరో నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుల వరకూ ప్రాసతో చెప్పే డైలాగులు గుర్తొస్తాయి. ఆయన సినిమాలు చూస్తే ఒక గురూజీ శిష్యులకి పాఠాలు చెప్పినట్లు అనిపిస్తుంది. మాటల మాంత్రికుడుగా పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ కలం పదును చాలా ఎక్కువ. త్రివిక్రమ్ కి డైలాగులు రాయడమే కాదు, క్రికెట్ ఆడడం కూడా వచ్చు అని చెప్తూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. షూటింగ్ అనగానే ఆర్టిస్టుల హడావుడి, గందరగోళం, టెన్షన్, షాట్ ఎలా వస్తుందో…