యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ తర్వాత పాన్ ఇండియా స్థాయిలో చేస్తున్న సినిమా ‘ఎన్టీఆర్ 30’. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీపై అనౌన్స్మెంట్ తోనే భారి అంచనాలు ఏర్పడ్డాయి. గత దశాబ్ద కాలంలో ఏ సినిమా కోసం వెయిట్ చెయ్యనంతగా ‘ఎన్టీఆర్ 30’ అప్డేట్ కోసం ఎన్టీఆర్ ఫాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ ముహూర్తం ఎప్పుడు? సెట్స్ పైకి ఎప్పుడు వెళ్తుంది? లాంటి అప్డేట్స్ కోసం ఎన్టీఆర్ ఫాన్స్ ట్విట్టర్ లో హంగామా చేశారు. తారకరత్న మరణించడంతో ఎన్టీఆర్ 30 ఓపెనింగ్ సెరిమొని వాయిదా పడింది. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమా ఆస్కార్ ప్రమోషన్స్ కోసం యుఎస్ వెళ్తున్నాడు. మార్చ్ 16న ఎన్టీఆర్ తిరిగి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎన్టీఆర్ 30 గురించి ఇంటరెస్టింగ్ విషయాలు బయటకి వచ్చే అవకాశం ఉంది. ఈలోపే నందమూరి అభిమానులకి ఎన్టీఆర్ 30 నుంచి ఒక సాలిడ్ అప్డేట్ రానుంది.
ఎన్టీఆర్ ఫాన్స్ కి మాత్రమే కాదు బాలీవుడ్ వర్గాలకి కూడా మంచి కిక్ ఇచ్చే ఆ న్యూస్ ఏంటి అంటే… ఎన్టీఆర్ 30 సినిమాలో ఎన్టీఆర్ పక్కన హీరోయిన్ గా జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తోందని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. వీటిని నిజం చేస్తూ కొరటాల శివ, జాన్వి ఫోటోషూట్ ని కూడా చేశాడు. మార్చ్ 6న జాన్వీ కపూర్ పుట్టిన రోజు కావడంతో, ఆ రోజు ఒక వీడియోతో జాన్వి కపూర్ ఎన్టీఆర్ 30 సినిమాలో నటిస్తుందని అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వడానికి చిత్ర యూనిట్ రెడీ అయ్యారని సమాచారం. నటీ నటుల పరంగా ఎన్టీఆర్ 30 నుంచి వస్తున్న ఫస్ట్ అఫీషియల్ అప్డేట్ ఇదే కావడం విశేషం. ఎన్టీఆర్ కి నేను చాలా పెద్ద ఫ్యాన్ అని చాలా సార్లు చెప్పిన జాన్వి కపూర్, ఎట్టకేలకు తన ఫేవరేట్ హీరో సినిమాతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది. మరి కొరటాల శివ, జాన్వి కపూర్ అప్డేట్ ని ఎంత స్పెషల్ గా డిజైన్ చేశాడో తెలియాలి అంటే మార్చ్ 6 వరకూ వెయిట్ చెయ్యాల్సిందే.