ఇండస్ట్రీలో కథలు, హీరోలు మారడం కొత్తేం కాదు. ఒక హీరో రిజెక్ట్ చేసిన కథతో మరో హీరో సినిమా చేయడం మామూలే. తాజాగా మహేష్ బాబు రిజెక్ట్ చేసిన కథ ఒకటి.. బాలీవుడ్ స్టార్ హీరో దగ్గరికి వెళ్లినట్టు తెలుస్తోంది. టాలీవుడ్‌లోనే కాదు బాలీవుడ్‌లోను ఒకే ఒక్క సినిమాతో సంచలనం సృష్టించాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. విజయ్ దేరవకొండతో చేసిన అర్జున్ రెడ్డి బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులిపేసింది. ఇదే సినిమాను బాలీవుడ్‌లో షాహిద్ కపూర్‌తో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి అక్కడా సందీప్ వంగా సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ప్రస్తుతం రణ్‌బీర్ కపూర్‌తో యానిమల్ అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్‌తో ఇదో ఊరమాస్ సబ్జెక్ట్ అని చెప్పేశాడు. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్‌తో స్పిరిట్, అల్లు అర్జున్‌తో భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు సందీప్. అయితే అర్జున్ రెడ్డి హిట్‌తో స్టార్ హీరోలంతా ఈ యంగ్ టాలెంట్‌తో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే ప్రభాస్, బన్నీ ప్రాజెక్ట్స్ అనౌన్స్మెంట్ ఇచ్చేశారు.
ఈ లిస్ట్‌లో నెక్స్ట్ మహేష్ ప్రాజెక్ట్ కూడా ఉంటుందని అనుకున్నారు. చాలా రోజుల నుంచి మహేష్, సందీప్ కాంబో గురించి చర్చ జరుగుతునే ఉంది కానీ కథే కుదరడం లేదట. సందీప్ చెప్పిన స్టోరీకి మహేష్ కనెక్ట్ కాలేకపోతున్నాడట. దాంతో మహేష్ ఈ కథను రిజెక్ట్ చేశాడనే టాక్ నడుస్తోంది. ఇక చేసేదేం లేక.. సందీప్ అదే కథతో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్‌తో సినిమా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే హృతిక్‌కి స్టోరీ కూడా నేరేట్ చేసినట్టు బీ టౌన్ టాక్. ఇదో భారీ బడ్జెట్ యాక్షన్ సినిమా అని.. హీరోది డ్యూయల్ రోల్ అని.. ఇప్పటి వరకకు ఇండియన్ స్క్రీన్ పై ఇలాంటి కానెప్ట్ రాలేదని బాలీవుడ్ వర్గాలంటున్నాయి. అందుకే మహేష్ ప్రయోగమెందుకని ఈ ‘రా’ సబ్జెక్ట్‌ని పక్కకు పెట్టి ఉంటాడనే డౌట్స్ వస్తున్నాయి. అయితే ఈ రూమర్స్ లో ఎంతవరకు నిజముందనేది తెలియాల్సి ఉంది.