Tiger Nageswara Rao: మాస్ మహరాజాతో యాక్షన్ సీక్వెన్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ravi Teja: గత యేడాది చివరిలో ‘థమాకా’ సినిమాతో తిరిగి సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేశాడు మాస్ మహరాజా రవితేజ! అంతేకాదు… ఈ యేడాది ప్రారంభంలోనే సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవితో కలిసి ‘వాల్తేరు వీరయ్య’లో కీలక పాత్రను పోషించాడు. ఈ సినిమా శుక్రవారం జనం ముందుకు వస్తోంది. ఇదిలా ఉంటే… రవితేజ నటిస్తున్న మరో సినిమా ‘టైగర్ నాగేశ్వరరావు’ తాజా షెడ్యూల్ గురువారంతో పూర్తయ్యింది. ఎ.ఎ. ఆర్ట్స్ బ్యానర్ లో అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ సినిమాకు వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. స్టూవర్ట్ పురం దొంగ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. రవితేజ టైటిల్ రోల్ ప్లే చేస్తుండగా ఆయన సరసన నూపూర్ సనన్ నాయికగా నటిస్తోంది. మానవతావాది, నాస్తికోద్యమ నాయకురాలు హేమలతా లవణం పాత్రను పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ పోషించడం విశేషం. అలానే ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ ఇందులో ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఇతర ప్రధాన పాత్రలలో గాయత్రి భరద్వాజ్, మురళీశర్మ, షన్ముఖి తదితరులు కనిపించబోతున్నారు.
రవితేజ నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీగా ‘టైగర్ నాగేశ్వరరావు’ రూపుదిద్దుకుంటోంది. జీవీ ప్రకాశ్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, శ్రీకాంత్ విస్సా సంభాషణలు సమకూర్చుతున్నారు. ఎప్పటికీ గుర్తుండిపోయే ఓ హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్ తో తాజా షెడ్యూల్ ను పూర్తి చేశామని చిత్ర బృందం సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది. దీనితో పాటు రవితేజ ‘రావణాసుర’ అనే చిత్రంలోనూ నటిస్తున్నాడు.
Also Read
- Peddi : "పెద్ది"పై అల్లు అర్జున్ జెన్యూన్ రివ్యూ... ప్రశంసల వర్షం
- Thalaivar173 : డాక్టర్ గా సూపర్ స్టార్.. డైరెక్టర్ ఎవరంటే
- Most Valuable Celebrities List : మోస్ట్ వ్యాల్యుబుల్ సెలబ్రిటి లిస్ట్ విడుదల.. టాప్ ప్లేస్లో ఎవరున్నారు? అల్లు అర్జున్ ర్యాంక్ ఎంత?
- LENIN : అఖిల్ 'లెనిన్' ఆంధ్ర థియేట్రికల్ రైట్స్ డీల్ క్లోజ్
తాజావార్తలు
-
Pawan Kalyan: 33 ఏళ్లలో ఇలాంటి ప్రమాదం జరగలేదు.. ప్రైవేటీకరణ జరగకూడదన్నదే మా ఆకాంక్ష!
-
Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
-
Ben Stokes: ఒక్క తప్పిదం.! కెప్టెన్ గానే కాదు.. జట్టులో స్థానం కూడా ప్రశ్నార్థకం..
-
Explained: లౌకికవాదం నుంచి హిందుత్వ వైపు.. బెంగాలీ మేధావుల మనసు ఎందుకు మారింది?
-
Darecation Explained: డబ్బులిచ్చి మరీ భయాన్ని కొంటున్నారు.. ట్రావెలింగ్లో నయా ట్రెండ్
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!