ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని పాన్ ఇండియా స్టార్ గా, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ని పాన్ ఇండియా డైరెక్టర్ గా మార్చేసింది ‘పుష్ప ది రైజ్’ సినిమా. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేసిన ఈ మూవీ నార్త్ లో సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఎర్ర చందనం స్మగ్లర్ పుష్పరాజ్ మ్యానరిజమ్స్ కి ఇంటర్నేషనల్ సెలబ్రిటీలు కూడా ఫిదా అయిపోయి ఫాలో అయిపోయారు. ఈ మాస్ హిస్టీరియాని మరింత ఎక్కువగా క్రియేట్ చెయ్యడానికి ‘పుష్ప ది రూల్’ సినిమాని తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. అల్లు అర్జున్-ఫాహద్ ఫజిల్ మధ్య డిజైన్ చేసిన హీరో-విలన్ ట్రాక్ కోసం సినీ అభిమానులందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ‘భన్వర్ సింగ్ షెకావత్’ పాత్రలో ఫాహద్ సూపర్బ్ గా పెర్ఫార్మ్ చేసాడు. పార్టీ లేదా పుష్ప, ఒక్కటి తక్కువ అయ్యింది… లాంటి ఫాహద్ చెప్పిన డైలాగ్స్ ని ఆడియన్స్ బయట తెగ వాడేశారు. పుష్ప ది రైజ్ ఎండ్ లో వచ్చిన ఫాహద్, సినిమాకే హైప్ తెచ్చాడు. ఇప్పుడు పార్ట్ 2లో పుష్పరాజ్ వైస్ షెకావత్ సర్ మధ్య జరగబోయే ఫైట్ ఎలా ఉంటుందో చూడాలని అందరూ వెయిట్ చేస్తున్నారు.
అంచనాలని మించే రేంజులో పుష్ప 2 ఉంటుందని ‘ఫస్ట్ లుక్’ పోస్టర్ తోనే క్లియర్ గా చెప్పేసిన సుకుమార్, ఫాహద్ ఫజిల్ కి సంబందించిన ఒక ఇంపార్టెంట్ షెడ్యూల్ ని కంప్లీట్ చేసాడట. మైత్రీ మూవీ మేకర్స్ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ లో “భన్వర్ సింగ్ షెకావత్ తో ఒక కీ షెడ్యూల్ ని కంప్లీట్ అయ్యింది. ఈసారి పగతో షెకావత్ తిరిగొస్తాడు” అంటూ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ లో సుకుమార్, ఫాహద్ లు మానిటర్ చూస్తూ సీన్ డిస్కస్ చేస్తున్న ఫోటో కూడా ఉంది. ఫాహద్ గుండు లుక్ లో మీసాలతో సీరియస్ గా ఉన్నాడు. ఇంటెన్స్ సీన్ నుంచి తీసిన ఫోటోల కనిపిస్తున్న ఈ పిక్ చూస్తుంటే పుష్ప 2 టీమ్ సూపర్బ్ సీన్ నే కంప్లీట్ చేసినట్లు ఉన్నారు. మరి పుష్పరాజ్-షెకావత్ సర్ మధ్య వార్ బాక్సాఫీస్ దగ్గర ఎన్ని కోట్ల కలెక్షన్స్ ని రాబడుతుందో చూడాలి.
A key schedule of #Pushpa2TheRule completed with 'Bhanwar Singh Shekhawat' aka #FahadhFaasil 💥💥
This time he will return with vengeance ❤️🔥🔥
Icon Star @alluarjun @iamRashmika @aryasukku @ThisIsDSP @SukumarWritings @PushpaMovie @TSeries pic.twitter.com/l4lixpvhm7
— Mythri Movie Makers (@MythriOfficial) May 18, 2023