డబ్ స్మాష్ వీడియోలతో క్లికై తెలుగు తెరపైకి వాలిన ఢిల్లీ డాల్ కేతిక శర్మ. పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరీ రొమాంటిక్ చిత్రంతో ఇంట్రడ్యూసైన ఈ భామకు యాక్టింగ్ అండ్ గ్లామర్ పరంగా మంచి మార్కులే పడ్డాయి. కానీ లక్ కలిసి రాలేదు ఫస్ట్ మూవీనే కాదు ఇప్పటి వరకు ఈ నాలుగేళ్లలో ఐదు సినిమాలు చేస్తే ఏ ఒక్కటి హిట్ కాలేదు. నాగ శౌర్య లక్ష్య, వైష్ణవ్ తేజ్ రంగ రంగా వైభవంగాతో హ్యాట్రిక్ ప్లాప్స్ అందుకుని డిజాస్టర్స్ బ్యూటీగా మారిపోయింది.
Also Read : OTT : ఆశ్చర్యపరుస్తున్న తమిళ సినిమాల ఓటీటీ డీల్స్
సాయి తేజ్- పవన్ కళ్యాణ్ బ్రో కూడా యావరేజ్ టాక్. బాలీవుడ్ చెక్కేస్తే ఫేట్ ఛేంజ్ అయిపోతుందునుకుంది కానీ అక్కడ ఇదే సీన్ రిపీట్. ఇంకో ఆఫర్ రాలేదు. ఆ టైంలో వచ్చిందే రాబిన్ హుడ్ స్పెషల్ సాంగ్. స్పెషల్ సాంగ్స్‌తో కొంత మంది స్టార్ హీరోయిన్లు ఫేమ్ తెచ్చుకున్నట్లు తెచ్చుకుందామనుకుంది బ్యూటీ. అదిదా సర్ఫైజ్ అంటూ హుక్ స్టెప్పులేస్తే మహిళా కమిషన్ వార్నింగ్ ఇచ్చి అతిపెద్ద సర్పైజ్ ఇచ్చింది మేడమ్‌కు. సాంగ్ చేసిన ఏ మాత్రం యూజ్ కాలేకపోయింది కేతికకు. ప్రజెంట్ కేతిక చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. తెలుగులో శ్రీ విష్ణు సరసన ‘సింగిల్’ మూవీ చేస్తోంది. అలాగే ఓ బైలింగ్వల్ మూవీ చేస్తోంది. తూంగవనమ్, కేకే ఫేం రాజేష్ ఎం సెల్వ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ ప్రాజెక్టుకు కమిటయ్యింది. అయితే ఈ రెండింటిలోనూ ఆమె సోలో హీరోయిన్ కాదు. ‘సింగిల్’ మూవీలో ‘లవ్ టుడే’ బ్యూటీ ఇవానాతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. అలాగే బైలింగ్వల్ మూవీలో అదితి రావ్ హైదరీ లీడ్ రోల్. ఈ రెండు సినిమాలలో ఈ సొగసుల బ్యూటీకి హిట్ ఎవరు ఇస్తారో చూడాలి.