మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నాడు. క్రాక్ తో కంబ్యాక్ ఇచ్చిన రవితేజ, ధమాకా సినిమాతో 100 కోట్ల మార్కెట్ ని చేరుకున్నాడు. వాల్తేరు వీరయ్య సినిమాలో చిరుకి తమ్ముడిగా స్పెషల్ రోల్ ప్లే చేసిన రవితేజ, ఈ మూవీతో కూడా వంద కోట్లు రాబట్టాడు. బ్యాక్ టు బ్యాక్ రెండు వంద కోట్లు రాబట్టిన హీరోగా మంచి జోష్ లో ఉన్న రవితేజ జనవరి 26న 55వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. ఈ సంధర్భంగా సోషల్ మీడియాలో రవితేజ హాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేస్తూ మాస్ మహారాజా ఫాన్స్ సందడి చేస్తున్నారు. ధమాకా సినిమాలో కామెడీ చేసిన రవితేజ, వాల్తేరు వీరయ్య సినిమాలో ఎమోషన్ పండించాడు. తనకి సరైన క్యారెక్టర్ పడాలే కానీ ఎలాంటి ఎమోషన్ ని అయినా ప్రెజెంట్ చెయ్యగలను అని మరోసారి ప్రూవ్ చేశాడు. రవితేజ అభిమానులు ఎప్పుడూ లేనంత యాక్టివ్ గా ఈ టైంలోనే నెక్స్ట్ మూవీ గురించి అప్డేట్ రిలీజ్ చేస్తే ఆ సినిమాపై అంచనాలు పెరుగుతాయి. ఈ విషయం క్లారిటీగా తెలిసిన ‘రావాణాసుర’ మేకర్స్ జనవరి 26న గ్లిమ్ప్ ని రిలీజ్ చెయ్యడానికి రెడీ అయ్యారు.
“Get ready for a special treat on MASS MAHARAJA RaviTeja birthday A Glimpse of #Ravanasura On JAN 26th 2023″ అంటూ రావణాసుర మేకర్స్ ట్వీట్ చేశారు. అక్కినేని సుశాంత్ స్పెషల్ రోల్ ప్లే చేస్తున్న ఈ మూవీకి కూడా భీమ్స్ మ్యూజిక్ ఇస్తుండడం విశేషం. ధమాకా లాంటి ఆల్బమ్ ని భీమ్స్ మరోసారి ఇస్తే రావణాసుర సినిమా థియేటర్స్ లో రిలీజ్ అవ్వడం కన్నా ముందే హిట్ టాక్ ని సొంతం చేసుకోగలదు. ప్రస్తుతం రవితేజపై ఉన్న పాజిటివిటిని కాష్ చేసుకోగలిగితే అది రావణాసుర ప్రమోషన్స్ చాలా హెల్ప్ అవుతుంది. మరి జనవరి 26న రవితేజ పుట్టిన రోజు సంధర్భంగా రావణాసుర నుంచి బయటకి రానున్న ఆ గ్లిమ్ప్స్ లో సుధీర్ వర్మ ఏం చూపిస్తాడో చూడాలి.
Get ready for a special treat on MASS MAHARAJA @RaviTeja_offl birthday😎
A Glimpse of #Ravanasura On JAN 26th 2023 🔥
Stay Tuned ❤️🔥@iamSushanthA @sudheerkvarma @RTTeamWorks @SrikanthVissa @rameemusic #BheemsCeciroleo @RavanasuraMovie @AbhishekPicture pic.twitter.com/fWD6gBhOHX
— RT Team Works (@RTTeamWorks) January 24, 2023