ధమాకా, వాల్తేరు వీరయ్య తర్వాత వరుస ఫ్లాపుల్తో సతమతౌతున్న రవితేజ మాస్ జాతరతో హిట్ కొడతాడన్న హోప్ క్రియేటయ్యింది. ఖాకీ సెంటిమెంట్ కూడా యాడ్ అవ్వడం, ధమాకా బ్యూటీ శ్రీలీల మరోసారి జోడీ కట్టడంతో పక్కా బ్లాక్ బస్టర్ అనుకున్నారు. తీరా చూస్తే మాస్ జాతర డిజాస్టర్ అయింది. దాంతో ఇక రవితేజ హిట్ కొట్టడం జరగదు అనుకున్నారు. అటు ఫ్యాన్స్ కూడా తమ హీరో హిట్ ఎప్పడు కొడతారా అని ఎంతగానో ఎదురుచూసారు. అలాంటి టైమ్ లోనే ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను అనౌన్స్ చేశారు.
Also Read : MSG : మన శంకరవరప్రసాద్ గారు డే – 1 కలెక్షన్స్..
నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ, చిత్ర లహరి వంటి సినిమాలతో ఆకట్టుకున్న కిశోర్ తిరుమల డైరెక్షన్ లో ఈ సినిమా రూపొందింది. గతంలో పొంగల్‌కు పలు సినిమాలు రిలీజ్ చేసి సక్సెస్ అందుకున్న ట్రాక్ రికార్డ్ రవితేజది. అదే కాన్ఫిడెంట్ తో ఈ రోజు భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి ఆట నుండే హిలేరియస్ కామెడీ ఫిల్మ్ అనే టాక్ ను ఆడియెన్స్ నుండి రాబట్టుకుని సూపర్ హిట్ కొట్టేసింది. దాదాపు 6 ఏళ్లుగా హిట్ లేని రవితేజకు సాలిడ్ హిట్ అందించింది భర్త మహాశయులకు విజ్ఞప్తి. రవితేజ వింటేజ్ కామెడీ, సాంగ్స్, డాన్స్ లతో అలరించాడు రవితేజ. అటు ఓవర్సీస్ ఆడియన్స్ నుండి కూడా ఈ సినిమాకు సూపర్బ్ టాక్ అందుకుంది. ముఖ్యంగా సెకండాఫ్ కు మంచి స్పందన వస్తోంది. రవితేజ ప్రీవియస్ సినిమాలు ప్రభావంతో స్లో స్టార్ట్ అందుకున్న భర్త మహాశయులకు విజ్ఞప్తి నైట్ షోస్ నుండి కలెక్షన్స్ గట్టిగా ఉంటాయని ట్రేడ్ భావిస్తోంది.