బ్రేకప్ టియర్స్ : లైవ్ లో కన్నీళ్లు పెట్టుకున్న దీప్తి సునయన

అత్యంత ప్రజాదరణ పొందిన సోషల్ మీడియా స్టార్, బిగ్ బాస్ కంటెస్టెంట్ దీప్తి సునైనా, మరొక యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్‌తో విడిపోతున్నట్లు ఇటీవలే ప్రకటించింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో లైవ్ సెషన్‌ను నిర్వహించి అభిమానులను ఆశ్చర్యపరిచింది. ‘ఇన్‌స్టా’ సెషన్‌కు వెళ్లి దీప్తి తన జీవితాన్ని ఎలా ప్లాన్ చేస్తున్నారో వివరించింది. “ఇన్ని సంవత్సరాలలో నేను విఫలమైన చాలా విషయాలను తెలుసుకోవాలి అనుకుంటున్నాను. నా జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడానికి నేను సిద్ధంగా ఉన్నాను” అంటూ స్టార్ట్ చేసింది. అయితే చాలా మంది అభిమానులు షణ్ముఖ్‌తో విడిపోయి ఆమె తప్పు చేసిందని కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరు ఆమెను విడిపోవడానికి గల కారణాల గురించి అడగడం ప్రారంభించారు.

Read Also : ‘ఆంధ్రావాలా’ గురించి షాకింగ్ విషయాన్ని వెల్లడించిన తారక్

ఈ ప్రశ్నలను పట్టించుకోకుండా దీప్తి తన కొత్త పెంపుడు కుక్కను ప్రేక్షకులకు పరిచయం చేయడం ద్వారా టాపిక్‌ను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేసింది. అయితే అది వర్కవుట్ కాలేదు. ఆమె బ్రేకప్ ను తలచుకొని కన్నీటి పర్యంతం అయ్యింది. దీప్తి కాసేపు కెమెరా నుండి దూరంగా వెళ్ళిపోయింది. ఆమె కన్నీళ్లను ఆపుకోలేక లైవ్ సెషన్‌ను ఉన్నట్టుండి క్లోజ్ చేయడం చర్చనీయాంశంగా మారింది.

Related Articles

Latest Articles