తెలుగు సినిమా రంగంలో వారసులకు కొదవలేదు. ప్రముఖ నటీనటుల కుమారులే కాదు నిర్మాతలు, దర్శకులు, ఇతర సాంకేతిక నిపుణుల పిల్లలు సైతం హీరోలుగా గుర్తింపు తెచ్చుకోవడానికి తాపత్రయ పడుతూ ఉంటారు. అయితే ఈసారి చివరి నిమిషంలో ‘ట్రిపుల్ ఆర్’ మూవీ సంక్రాంతి బరి నుండి తప్పుకోవడంతో ఈ సీజన్ పై టాలీవుడ్ వారసులు కన్నేశారు. మూవీ మొఘల్ రామానాయుడు మనవడు, సురేశ్ బాబు తనయుడు రానా నటిస్తున్న ‘1945’ చిత్రం ఈ నెల 7న విడుదల కాబోతోంది.…