Sumanth Ashwin :’7డేస్ 6నైట్స్’ మాస్టర్ పీస్ అనిపించింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘7 డేస్ 6 నైట్స్’. సుమంత్ అశ్విన్, రోహన్, మెహర్ చాహల్, కృతికా శెట్టి నటించిన ఈ మూవీ జూన్ 24న విడుదల అవుతోంది. సోమవారం ఈ సినిమా కొత్త ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో ఎంఎస్ రాజు మాట్లాడుతూ ”కొత్త ట్రైలర్ చూడగానే యూత్‌ఫుల్ ఎంటర్ టైనర్ అని అర్థం అవుతుంది. ఈ సినిమాను లో-బడ్జెట్ సినిమాగా తోసేయాలని అనుకోలేదు. ప్రేక్షకులకు మంచి సినిమా ఇవ్వాలనే ట్రై చేశాం. చిన్న సినిమా ఎన్ని వండర్స్ క్రియేట్ చేస్తుందో చూపించాలని అనుకుంటున్నాం. ‘7 డేస్ 6 నైట్స్’ అనే బాంబు తీసుకొస్తున్నాం. తెలంగాణ, రాయలసీమ, ఆంధ్రా అన్నిచోట్లా ఎంత తక్కువ టికెట్ రేట్ ఉంటే అంతకు అమ్మమని డిస్ట్రిబ్యూటర్లకు చెప్పాను. ఓటీటీలో నేను డైరెక్ట్ చేసిన ‘డర్టీ హరి’లో పెద్ద హిట్. ఇప్పుడు ‘7 డేస్ 6 నైట్స్’ కూడా థియేటర్లలో అందరినీ మెప్పిస్తుంది. కాలేజీలు ఓపెన్ అయ్యాయి. యూత్ కు కావాల్సిన కంటెంట్ సినిమాలో ఉంది. అమ్మాయిలు, అబ్బాయిలు క్లాసులు ఎగ్గొడతారో? లేదో? చూడాలని ఉంది. ఈ సినిమాతో నిర్మాతలుగా మారిన మా అబ్బాయి, అమ్మాయికి ఆల్ ది బెస్ట్” అని అన్నారు.

Also Read
- Next Year Movies : 2027లో టాలీవుడ్లో రికార్డ్స్ మోత మోగనున్నాయా..
- Maremma Review: మారెమ్మ సినిమా రివ్యూ..
- Udaya Bhanu: 15 ఏళ్లుగా తపస్సు చేస్తున్నా.. ప్రశాంతంగా 2 గంటలు కూడా నిద్రపోలేదు.. ఉదయ భాను ఎమోషనల్ కామెంట్స్!
- Vrushakarma Release Update: 'వృషకర్మ' కీలక అప్డేట్.. ప్రభాస్‌ను ఢీకొట్టబోతున్న నాగ చైతన్య?
ఎంఎస్ రాజు కుమార్తె రిషితా దేవి మాట్లాడుతూ ”సినిమా చూశా. నాకు బాగా నచ్చింది. ప్రేక్షకులు కూడా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను” అని చెప్పారు.
హీరో కమ్ ప్రొడ్యూసర్ సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ ”సినిమా రిలీజ్ కోసం ఎగ్జైటెడ్ గా ఉన్నాం. నిజాయతీగా చెప్పాలంటే నాకు’7 డేస్ 6 నైట్స్’ మాస్టర్ పీస్ లా కనిపించింది” అని చెబుతున్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాతల్లో ఒకరైన రజనీకాంత్.ఎస్, హీరోయిన్లు మెహర్ చాహల్, కృతికా శెట్టి, మరో హీరో రోహన్, లిరిక్ రైటర్ కృష్ణకాంత్ (కేకే), సంగీత దర్శకుడు సమర్థ్ గొల్లపూడి, కో ప్రొడ్యూసర్ శ్రీనివాసరాజు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
MP Mithun Reddy: వైసీపీదే హవా.. నెల్లూరులో మిథున్ రెడ్డి ధీమా
-
Saudi Arabia-Pakistan: మక్కా ఒప్పందానికి బీటలు.. సౌదీకి హ్యాండిచ్చిన పాకిస్థాన్!
-
1980s Trend : 1980s ట్రెండ్ పేరుతో ఫేక్ యాప్స్.. నెటిజన్లకు సైబర్ కేటుగాళ్ల టార్గెట్
-
IRCTC Scam Case: లాలూ కుటుంబానికి బిగ్ షాక్.. ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ..
-
CM Chandrababu : వచ్చే కాన్ఫరెన్స్ నాటికి 100 శాతం కనెక్టివిటీ ఉండాల్సిందే
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?