నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేసిన ‘అన్‌స్టాపబుల్’ రికార్డులన్నీ బద్దలు కొడుతూ ‘అన్‌స్టాపబుల్’గా దూసుకెళ్తోంది. పలువురు సెలెబ్రిటీలు పాల్గొన్న పాపులర్ టాక్ షో ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే’ ఇప్పటికే ఐఎండీబీలో మంచి రేటింగ్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఓటిటి ప్లాట్‌ఫామ్‌లో అత్యధికంగా వీక్షించిన షోగా నిలిచి ఆహా అన్పిస్తోంది. ఎంతో మంది టాలీవుడ్ సెలబ్రిటీలకు రెడ్ కార్పెట్ పరిచిన ఈ యూనిక్ టాక్ షో 40 కోట్ల నిమిషాలకు పైగా ప్రసారమై రికార్డు సృష్టించిందని అధికారికంగా ప్రకటించారు టీం. మొత్తానికి ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే’ సీజన్ రికార్డులను క్రియేట్ చేస్తూ సక్సెస్ ఫుల్ గా ముగిసింది. ఈ షోలో చివరగా మహేష్ బాబు ఎపిసోడ్ ప్రసారమైన విషయం తెలిసిందే.
Read Also : ఆగస్ట్ 7 న బిడ్డకు జన్మనివ్వబోతున్నా.. సమంత కామెంట్స్ వైరల్
బాలయ్య హోస్ట్‌గా వ్యవహరించిన ఈ షో ప్రత్యేకతతో ప్రేక్షకుల నుండి విశేష స్పందన, ఆదరణను సొంతం చేసుకుంది. బాలయ్య సమయానుకూలమైన పంచ్‌లు, మంత్రముగ్ధులను చేసే హోస్టింగ్ నైపుణ్యాలు ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే’ని అత్యుత్తమ టాక్ షోలలో ఒకటిగా మార్చాయి. ఇక ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే’ సీజన్-2 కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా ‘అఖండ’ విజయం తరువాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య నెక్స్ట్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే.