Phalana Abbayi Phalana Ammayi: విడివిడి రెండు ప్రాణాలిలా.. ముడిపడి ఏకమయ్యాయి ఇలా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Phalana Abbayi Phalana Ammayi: ‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’ వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత నటుడు నాగ శౌర్య, దర్శకుడు శ్రీనివాస్ అవసరాల కలయికలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ఫీల్ గుడ్ రొమాంటిక్ ఫిల్మ్ లో మాళవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తోంది. టీజీ విశ్వ ప్రసాద్, పద్మజ దాసరి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహా నిర్మాత. కళ్యాణి మాలిక్ సంగీతం అందిస్తున్నారు. ‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’ సినిమాల తరువాత నాగశౌర్య-శ్రీనివాస్ అవసరాల-కళ్యాణి మాలిక్ కలయికలో వస్తున్న సినిమా కావడంతో ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ సినిమా మార్చి 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్ల జోరును పెంచేశారు మేకర్స్. ఇప్పటికే ఈ చిత్రం నుంచి టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి మోడీ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
NBK108: బాలయ్య కూతురు రంగంలోకి దిగేసింది
Also Read
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
‘నీతో ఈ గడిచిన కాలం’అంటూ సాగిన ఈ గీతం ఆద్యంతం ఆకట్టుకొంటుంది. ఈ పాట కూడా ‘కనుల చాటు మేఘమా’, ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ టైటిల్ సాంగ్ తరహాలోనే వినసొంపుగా, వినగానే నచ్చేలా ఉంది. మెలోడీలను స్వరపరచడంలో కళ్యాణి మాలిక్ ది ప్రత్యేక శైలి అని ఈ పాటతో మరోసారి రుజువు చేసుకున్నారు. ఈ పాటకు ప్రముఖ గీత రచయిత భాస్కర భట్ల రవికుమార్ అద్భుతమైన సాహిత్యం అందించారు. “నీతో ఈ గడిచిన కాలం నడిచిన దూరం ఎంతో ఇష్టం చెవిలో చెప్పే కబురులు అన్నీ ఇష్టం ఇష్టం ఇష్టం” అంటూ సాగిన పాటలోని ప్రతి వాక్యం ఆకట్టుకుంటోంది. గాయని గీతామాధురితో కలిసి కళ్యాణి మాలిక్ ఈ పాటను ఎంతో అందంగా ఆలపించారు. హీరోహీరోయిన్లు ఒకరిపై ఒకరికున్న ఇష్టాన్ని, ప్రేమని తెలిపేలా సాగిన ఈ సాంగ్ లో జంట కెమిస్ట్రీ, విజువల్స్ కట్టిపడేస్తున్నాయి. ప్రకృతి అందాల నడుమ వారి ప్రేమ బంధాన్ని చూపించిన తీరు మెప్పిస్తోంది. మొత్తానికి సాంగ్స్ తో మెప్పించిన ఈ కాంబో మరో హిట్ ను తమ ఖాతాలో వేసుకుంటుందో లేదో చూడాలి.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓడిపోతామనుకున్నా.. అక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది..
-
Shai Hope: అదే మా కొంప ముంచింది.. చాలా బాధగా ఉంది.. వెస్టిండీస్ కెప్టెన్ ఆవేదన..
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!