గతేడాది యూట్యూబ్ సిరీస్ లలో బాగా పేరుతెచ్చుకున్న వెబ్ సిరీస్ 30 వెడ్స్ 21. తన కన్న 10 ఏళ్ళు చిన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్న ఒక యువకుడి కథను ఎంతో వినోదాత్మకంగా చూపించారు. చైతన్య రావ్ – అనన్య జంటగా మనోజ్-అసమర్థ్ సంయుక్తంగాకథను అందించిన ఈ సీజన్ 1 ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక తాజాగా ఈ సిరీస్ కి కొనసాగింపు మొదలైంది. 30 వెడ్స్ 21 సీజన్ 2 టీజర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ చూస్తుంటే సీజన్ 1 లో గొడవపడి కలిసిన జంట.. అన్యోన్య కాపురంలోకి దిగినట్లు తెలుస్తోంది. భార్యకు ఏం కావాలి అనేది తెలుసుకొని భర్త తన కోరికలను తీరుస్తునట్లు చూపించారు.
చిన్నతనంతో ఉన్న భార్యకు రియాలిటీని పరిచయం చేస్తూ, ఆమెకు జీవితం ఎలా ఉంటుంది అనేది భర్త నేర్పిస్తున్నట్లు చూపించారు. నాన్న భుజాల మీద ఎక్కి చూసే ప్రపంచానికి మన కాళ్ల మీద నిలబడి చూసే ప్రపంచానికి చాలా తేడా ఉంటుంది!.. మేఘన వెల్ కం టు అడల్ట్ వరల్డ్.. అంటూ హీరో చెప్పే డైలాగ్ .. సీజన్ 2 పై ఆసక్తిని పెంచేసింది. ఇక మేఘన గాఅనన్య.. పృథ్వీగా చైతన్య నటన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. టీజర్ తోనే అంచనాలు పెంచేసిన ఈ సిరీస్ ప్రేమికుల రోజున రిలీజ్ కానుంది. మరి మొదటి సీజన్ తో ప్రతి ఒక్కరి మదిని ఆకట్టుకున్న 30 వెడ్స్ 21 రెండో సీజన్ లో కూడా అందరిని ఆకట్టుకుంటుందేమో చూడాలి.