Mama Mascheendra 2.5 hour Live Telecast of Audience Reactions : యాక్టర్ – డైరెక్టర్ హర్షవర్ధన్ దర్శకత్వంలో సుధీర్ బాబు చేస్తున్న యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ మామా మశ్చీంద్ర. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పిపై నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మించిన ఈ సినిమా టీజర్, ట్రైలర్ తో పాజిటివ్ బజ్ ని క్రియేట్ చేసింది. తెలుగు, హిందీ భాషల్లో రూపొందిన ఈ ద్విభాషా చిత్రాన్ని సృష్టి సెల్యులాయిడ్ సోనాలి నారంగ్, సృష్టి సమర్పిస్తున్నారు. అక్టోబర్ 6న సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో హీరో సుధీర్ బాబు సహా సినిమా యూనిట్ ప్రమోషన్స్ లో పాల్గొంటోంది. అయితే ఇండియన్ సినీ హిస్టరీలోనే ‘‘మామా మశ్చీంద్ర’’ ఒక కొత్త ప్రయోగం చేస్తున్నట్టు అధికారికంగా సినిమా యూనిట్ ప్రకటించింది. అదేమంటే రేపు అనగా అక్టోబర్ 5న హైదరాబాద్ ఏఎంబీ థియేటర్లో సినిమాను ప్రీమియర్ గా ప్లే చేసి సినిమా చూస్తున్న అందరు ఆడియన్స్ ముఖకవళికలు క్యాప్చర్ చేయనున్నారు.
Gayathri Joshi: ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన షారుక్ ఖాన్ హీరోయిన్
ఇండియాలోనే ఒక సినిమాకి ఇలా చేయడం మొదటి సారి అని అంటున్నారు. అది కూడా కొన్ని నిముషాలు కాకుండా సినిమా చూస్తుంన్నంత సేపు క్యాప్చర్ చేయనున్నారని, వాటినే లైవ్ లో స్ట్రీమ్ చేయనున్నామని సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇక ‘మామా మశ్చీంద్ర’ చేయడానికి ప్రధాన కారణం హర్ష అని సుధీర్ బాబు ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. తొలిసారిగా హర్ష పై ఉన్న నమ్మకంతో తనతో వర్క్ చేయాలని కథ తీసుకొని రమ్మని చెప్పానని, తను చెప్పిన కథ నాకు చాలా నచ్చిందని అన్నారు. చాలా డిఫరెంట్ స్క్రిప్ట్ అని పేర్కొన్న ఆయన మనం, గుండెజారే గల్లంతైయ్యిందే చిత్రాలతో తను మంచి రైటర్ గా నిరూపించుకున్నారు. తనకు సినిమాలపై మంచి పట్టుంది, ‘మనం’ చూసినప్పుడు ఎంత కొత్తగా అనిపించిందో, మామా మశ్చీంద్ర చూసినప్పుడు కూడా అలాంటి కొత్త అనుభూతిని ఇస్తుందని సుధీర్ బాబు అన్నారు.