బిగ్ బాస్ నాన్‌స్టాప్ గొడవల మధ్య మరో వారం నామినేషన్‌కు రంగం సిద్ధమైంది. తాజాగా 12 మంది కంటెస్టెంట్లు ఎవిక్షన్‌కి నామినేట్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ షో నుంచి ముమైత్ ఖాన్, శ్రీరాపాక ఇద్దరూ ఎలిమినేట్ అయ్యారు. మొత్తానికి ఈ వారం అఖిల్, మహేష్, హమీద, నటరాజ్, అరియానా, బిందు, మిత్రా, శివ, చైతు, తేజస్వి, అజయ్, స్రవంతి నామినేట్ అయ్యారు.
Read Also : Balakrishna’s Next : అనిల్ రావిపూడి అప్డేట్… ఎంత వరకు వచ్చిందంటే ?
తేజస్వి… వెనుక గోతులు తీస్తుంది అంటూ అరియానను, బిందును నామినేట్ చేసింది. ఆర్జే చైతు… మిత్రా, తేజస్విలను, మహేష్ విట్టా… నటరాజ్, అజయ్ లను, అషురెడ్డి…. నటరాజ్ మాస్టర్, మహేష్ విట్టాలను, యాంకర్ శివ… అఖిల్, నటరాజ్ మాస్టర్ ను, హమీద… అజయ్, స్రవంతిలను, అఖిల్… ఆర్జే చైతు, శివలను, మిత్రా… ఆర్జే చైతు, శివలను, అరియనా… మిత్రా, తేజస్విలను, అజయ్… మహేష్ విట్టా, హమీదాలను, నటరాజ్ మాస్టర్… బిందు మాధవి, శివాలను నామినేట్ చేశారు. ఇక సరయు… అజయ్, స్రవంతిలను, అనిల్… మిత్రాలను మహేష్ విట్టాలను నామినేట్ చేశారు. ఇక ఈ నామినేషన్ ప్రక్రియలో హౌజ్ మేట్స్ మధ్య గట్టిగానే వార్ జరిగింది.