Negative reviews and low rating for Kushi on Book My Show by abusing Vijay Deverakonda: విజయ్ దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్ గా నటించిన ఖుషి సినిమా ఈ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు రాగా మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ దక్కించుకుంది. విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకొని ఫ్యామిలీ ఆడియన్స్ అందరినీ ఆకట్టుకుంటూ ముందుకు దూసుకు వెళుతోంది ఖుషి. రెండు రోజుల్లోనే ఈ సినిమా 50 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసి విజయ్ దేవరకొండ కెరియర్లో అత్యధిక కలెక్షన్లు చేసిన సినిమాగా నిలిచింది. ఆ సంగతి అలా ఉంచితే ఈ సినిమా మీద నెగిటివ్ టాక్ కూడా స్ప్రెడ్ అవుతున్న సంగతి సోషల్ మీడియా ఫాలో అవుతున్న వారందరికీ తెలిసిందే. అయితే ఈ నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అవ్వడానికి కొంత మంది పనిచేస్తున్నారనే వాదన విజయ్ దేవరకొండ అభిమానులు తెరమీదకి తీసుకొస్తున్నారు. దానికి ఉదాహరణగా చెబుతూ ప్రముఖ టికెట్ బుకింగ్ యాప్ బుక్ మై షోలో విజయ్ దేవరకొండ నటించిన ఖుషి సినిమా బాలేదు అని చెబుతూ వన్ బై టెన్ రేటింగ్స్ దాదాపు ఒక పదివేల వరకు నమోదైనట్లు తెలుస్తోంది.
అయితే అవి జెన్యూన్ గా నమోదు చేసినవి కాదని బాట్స్ అంటే ఆటోమేటిక్ గా సిస్టం ద్వారా మ్యానిప్యులేట్ చేసి ఇలా తక్కువ రేటింగ్స్ ఇచ్చి సినిమా రేటింగ్ తక్కువ చేసే ప్రయత్నం చేస్తున్నారని దేవరకొండ అభిమానులు ఆరోపిస్తున్నారు. నిజంగా పబ్లిక్ సినిమా చూసి వారికి నచ్చకపోతే ఇలాంటి రేటింగ్ ఇచ్చినా పర్వాలేదు కానీ కావాలని ఒక పనిగట్టుకుని కొందరు ఇలా చేస్తుంటే ఏ మాత్రం సహించేది లేదని వారు కామెంట్లు చేస్తున్నారు. దీని వెనుక ప్రముఖ హీరో టీమ్ ఉందని అంటూ కామెంట్లు చేస్తున్నా, ఆ హీరో ఎవరు అనే విషయం మీద మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు. నిజంగానే బుక్ మై షో కి ఇలా ఫేక్ రేటింగ్ ఇచ్చారా లేదా అనే విషయం మీద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఒకవేళ పదివేల ఫేక్ రేటింగ్స్ కనుక ఇవ్వడం నిజమే అయితే దీని వెనుక ఎవరో పెద్ద ఎత్తున కుట్ర చేసినట్లు భావించాల్సి వస్తుందని చెప్పక తప్పదు.