అవసరాల శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న సినిమా “101 జిల్లాల అందగాడు”. ఈ కామెడీ ఎంటర్‌టైనర్ తో సినీ ప్రియులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు. నూతన దర్శకుడు రాచకొండ విద్యాసాగర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 3న గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో నిర్మాతలు సినిమా ప్రమోషన్లలో వేగం పెంచారు. ప్రమోషన్స్‌లో భాగంగా సినిమా ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు. నవ్వించే అంశాలతో ఈ ట్రైలర్ ఆసక్తికరంగా కొనసాగింది. అవసరాల శ్రీనివాస్ తన బాడీ లాంగ్వేజ్, ఎక్స్‌ప్రెషన్స్, ఎమోషన్స్‌తో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. అంతేకాకుండా తన పెళ్ళికి బట్టతల అడ్డంకిగా మారడం వంటి ఎమోషన్ సీన్స్ తో సినిమాపై ఆసక్తిని పెంచేశారు.
Read Also : నీకేంటి నొప్పి… వైరల్ వీడియోపై ఆర్జీవీ రియాక్షన్
అవసరాల శ్రీనివాస్ ఈ చిత్రంలో రుహాని శర్మతో రొమాన్స్ చేస్తున్నాడు. ఈ మూవీ కోసం ఆయన స్వయంగా కథను రాశాడు. రామ్, కిరణ్ గంటి సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ విభాగాలను నిర్వహిస్తున్న ఈ చిత్రానికి శక్తికాంత్ కార్తీక్ సంగీతం అందించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దిల్ రాజు, క్రిష్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గతంలో సినిమా ప్రమోషన్లలో భాగంగా శ్రీనివాస్ బట్టతల వీడియోను మేకర్స్ వైరల్ చేసిన విషయం తెలిసిందే.