సాధారణంగా చలి కాలంలో వాతావరణ మార్పుల వల్ల నీటిని ఎక్కువ తాగేందుకు జనాలు వెనకాడుతారు. అయితే నీరు తగినంత తాగకపోతే.. ఆ ప్రభావం.. మూత్రపిండాలు, మెదడు పడతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Read Also: Shocking Video: : విద్యార్దిని మెట్లపై నుంచి కిందకు తోసేసిన ప్రిన్సిపాల్… వీడియో వైరల్
చలికాలంలో 500 మిల్లీ లీటర్ల కంటే తక్కువగా నీరు తాగడంతో.. మూత్రంలో ఉండే నీటిన భర్తీ చేసేందుకు మూత్ర పిండాలు చాలా కష్టపడాల్సి వస్తుందని.. నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో మూత్ర పిండాల వడపోత శక్తి తగ్గిపోయి.. వ్యర్థాలు బయటకు పోకుండా శరీంలో ఉండిపోతాయి. త్వదారా మూత్ర పిండాలకు నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడుతుందంటున్నారు.
Read Also:Humanity Fading: రాను రాను జనాల్లో సచ్చిపోతున్న మానవత్వం.. ప్రాణం పోతున్న…
అలాగే తక్కువ నీటిని తీసుకోవడంతో రక్త పరిమాణం తగ్గి.. మెదడుకు చేరే ఆక్సిజన్ పరిమాణాన్ని తగ్గిస్తుందంటున్నారు. దీంతో ఎదయినా విషయంపై దృష్టి పెట్టడంలో ఇబ్బంది.. మానసిక స్థితిలో మార్పులు.. అలసట వంటి సమస్యలకు దారి తీస్తుంది. తక్కువ నీరు తాడడంతో మీ కండరాలు శక్తి సరఫరా తగ్గుతుంది. అంతే కాకుండా.. దీని వలన పని చేసేటపుడు అలసట, శక్తి లేకపోవటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. జీర్ణక్రియ విషయంలో కూడా నీరు కీలక పాత్ర పోషిస్తుంది. చాలా తక్కువగా నీటిని తీసుకోవడంతో జీర్ణక్రియ మందగిస్తుంది. మలబద్ధకం, అజీర్ణానికి దారితీస్తుంది. ఇది ఆకలిని కూడా ప్రభావితం చేస్తుంది. అయితే ఈ సమాచారం అంతా మేము ఇంటర్నెట్ నుంచి సేకరించినట్లు గమనించండి.