చలికాలంలో ఉష్ణోగ్రతలు తగ్గిపోవడంతో శరీరం రోగ నిరోధక శక్తి కొంత బలహీనపడుతుంది. ఈ సమయంలో వైరల్ ఇన్ఫెక్షన్లు, ముఖ్యంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం, ఈ సీజన్‌లో రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్ కేసులు వేగంగా పెరిగే ప్రమాదం ఉంది. RSV ఊపిరితిత్తులు మరియు శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం చేసే వైరస్ కావడంతో, చిన్నపిల్లల్లో ఇది మరింత తీవ్రతతో కనిపిస్తుంది.
చలికాలంలో గాలిలో తేమ తగ్గిపోవడం, విటమిన్ D సరిపడా అందకపోవడం వంటి కారణాల వల్ల RSV మరింత వేగంగా వ్యాపిస్తుంది. మొదటగా ఇది చిన్నపిల్లలను ప్రభావితం చేస్తుంది; అక్కడినుంచి పెద్దలకు కూడా పాకే అవకాశం ఉంటుంది.
ఎవరికి ఎక్కువ ప్రమాదం?:
#12 నెలలు లేదా అంతకంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు
#ముందుగా ఆరోగ్య సమస్యలు ఉన్న పిల్లలు
#గుండె లేదా ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు ఉన్నవారు
#సంవత్సరమంతా RSV సోకే అవకాశం ఉన్నప్పటికీ, చలికాలంలో ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది.
లక్షణాలు:
కొన్ని సందర్భాల్లో RSV లక్షణాలు తీవ్రంగా ఉండవచ్చు. సాధారణంగా కనిపించే లక్షణాలు:
#నిరంతర దగ్గు
#వేగంగా లేదా గురకతో శ్వాస తీసుకోవడం
#చలి ఎక్కువగా అనిపించడం
#శరీరం నొప్పులు
#గొంతు నొప్పి
#ముక్కు కారడం లేదా ముక్కు మూసుకుపోవడం
#జ్వరం
ఈ లక్షణాలు తీవ్రమైతే వెంటనే ఆసుపత్రిని సంప్రదించడం మంచిది.
జాగ్రత్తలు:
#పిల్లలను చల్లని గాలికి ఎక్కువగా ఎక్స్‌పోజ్ కాకుండా చూడాలి
#తరచూ చేతులు కడుక్కోవాలి
#రద్దీ ప్రదేశాలకు చిన్నపిల్లలను తీసుకెళ్లడం తగ్గించాలి
#ఇంటిలో గాలికి తేమ సరిపడా ఉండేలా చూసుకోవాలి
#సాధారణ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా RSV నుంచి రక్షణ పొందే అవకాశం ఉంది.
ఇవి ఇంటర్నెట్‌లో లభ్యమయ్యే సాధారణ ఆరోగ్య సమాచారం ఆధారంగా సేకరించబడినవి. మీకు ఏవైనా ఆరోగ్య సంబంధిత సందేహాలు ఉంటే, తప్పనిసరిగా మీ దగ్గర్లోని వైద్య నిపుణులను సంప్రదించండి.