చలికాలంలో ఉష్ణోగ్రతలు తగ్గిపోవడంతో శరీరం రోగ నిరోధక శక్తి కొంత బలహీనపడుతుంది. ఈ సమయంలో వైరల్ ఇన్ఫెక్షన్లు, ముఖ్యంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం, ఈ సీజన్‌లో రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్ కేసులు వేగంగా పెరిగే ప్రమాదం ఉంది. RSV ఊపిరితిత్తులు మరియు శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం చేసే వైరస్ కావడంతో, చిన్నపిల్లల్లో ఇది మరింత తీవ్రతతో కనిపిస్తుంది. చలికాలంలో గాలిలో తేమ తగ్గిపోవడం, విటమిన్ D సరిపడా…