Good Pressure: ఇది “మంచి ఒత్తిడి” గురూ… దాని వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
- రోజూ ఆఫిసుల్లోనూ.. ఇంట్లోనూ పలు సందర్భాల్లో ఒత్తిడికి గురవుతుంటాం
- ఒత్తిడి మానసిక ఆరోగ్యానికి చాలా హానికరం
- ప్రతి ఒక్కరి జీవితంలో ఒత్తిడి సహజం
- కొన్ని సందర్భాల్లో ఒత్తిడి కూడా మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు
- దాన్నే మంచి ఒత్తిడి అంటారు
- దీని వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతి ఒక్కరి జీవితంలో ఒత్తిడి సహజం. రోజూ ఆఫిసుల్లోనూ.. ఇంట్లోనూ పలు సందర్భాల్లో ఒత్తిడికి గురవుతుంటాం. ఒత్తిడి మానసిక ఆరోగ్యానికి చాలా హానికరం. శృతి మించితే ఒత్తిడి ప్రమాదమం.. కానీ కొన్ని సందర్భాల్లో ఒత్తిడి కూడా మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీన్నే యూస్ట్రెస్ అని అంటారు. మన భాషలో చెప్పాలంటే ఇది దీన్ని మంచి ఒత్తిడి అని పిలుస్తుంటాం.
READ MORE: Kolkata Doctor Case: కోల్‌కతా ఘటన కేసులో వెలుగులోకి విస్తుపోయే విషయాలు..
Also Read
- Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
- Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
- Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
- Plastic Chairs Cleaning Tips: పసుపెక్కిన ప్లాస్టిక్ కుర్చీలను చూసి విసిగిపోయారా? ఈ టిప్‌తో మీ కుర్చీలకు కొత్త లుక్!
మంచి ఒత్తిడి అంటే ఏమిటి?
మనస్తత్వవేత్తల ప్రకారం.. మంచి ఒత్తిడిని యూస్ట్రెస్ అని పిలుస్తారు. ఇది ఒక రకమైన ఒత్తిడి. ఉత్సుకత, అనూహ్య ఘటనలు, ప్రమాదాల వంటివి శరీరంలో రసాయన ప్రతిస్పందనలను ప్రేరేపిస్తాయి. ఇదే మంచి ఒత్తిడికి ఇవే కారణం. ఈ మంచి ఒత్తిడి లేకపోతే హాయిగా జీవించటం కష్టమవుతుంది. బాగా ఉత్సహంగా ఉన్నప్పుడు మన పల్స్ రేటు పెరుగుతుంది. హార్మోన్ల ఉత్పత్తి కూడా పెరుగుతుంది. దీని వల్ల ఎటువంటి ప్రమాదం ఉండదు. ఉదాహరణకు కొత్త వ్యక్తితో డేటింగ్‌కు వెళ్లడం లేదా జీవితాన్ని ప్రారంభించడం, పదోన్నతి పొందడం, కొత్త ఉద్యోగానికి సిద్ధపడడం, ఇవన్నీ చేసేటప్పుడు మనం అనుభవించే ఒత్తిడిని మంచి ఒత్తిడి అంటారు.
READ MORE: Stock market: స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
మంచి ఒత్తిడి యొక్క ప్రయోజనాలు
1. మంచి ఒత్తిడి జ్ఞాపకశక్తికి మద్దతు ఇస్తుంది. ఉదాహరణకు.. పరీక్షల సమయంలో ఒత్తిడికి గురైనప్పుడు, మనం విషయాలను మరింత లోతుగా అర్థం చేసుకోగలుగుతాం. ఇది జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.
2. ఆఫీసులో కొత్త ప్రాజెక్టును పొందారనుకోండి. మంచి ఒత్తిడి దాన్ని సాధించటానికి బలాన్ని సమకూరుస్తుంది. నైపుణ్యాలను సజావుగా వాడుకోవటానికి, కొత్త నైపుణ్యాలను నేర్చుకోవటానికి ఉత్సాహం చూపేలా చేస్తుంది. అయితే ఇలాంటి ప్రాజెక్టులు వాస్తవికమైనవి అయితేనే మంచి ఒత్తిడికి దారితీస్తాయి. తలకు మించిన ప్రాజెక్టులు చేపట్టినప్పుడు, పని భారం పెరిగినప్పుడు, తోటి ఉద్యోగులు సహకరించనప్పుడు ఏర్పాడే ఒత్తిడి మాత్రం వేరు. దీని వల్ల మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
3. మనకు సహజంగానే నేర్చుకునే గుణం ఉన్నప్పటికీ కొత్త విషయాలు అభ్యసించటం, నైపుణ్యం సాధించటం అంత తేలిక కాదు. చిన్న చిన్న విజయాలను సాధిస్తూ వస్తుంటే ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. వాటి నుంచి స్ఫూర్తి పొందుతూ మెరుగు పరచుకోవటానికి దోహదం చేస్తుంది. మంచి ఒత్తిడి ఇలాంటి పరిస్థితుల్లో ముందుకు సాగేలా ప్రోత్సహిస్తుంది.
4. మన సామర్థ్యాన్ని సవాల్ చేసే కఠినమైన వ్యాయామాలూ మంచి ఒత్తిడికి నిదర్శనమని చెప్పుకోవచ్చు. ఇవి కష్టమైనవే అయినా వీటితో చేకూరే ప్రయోజనాలు ఉత్సాహాన్ని కలగజేస్తాయనడంలో అతిశయోక్తి లేదు.
5. మంచి ఒత్తిడి మానవ ఉత్పాదకతను పెంచుతుంది. మంచి ఒత్తిడి మీ ఉత్తమమైనదాన్ని అందించడానికి మీపై ఒత్తిడిని సృష్టిస్తుంది. మీరు ఏదైనా పనిని మరింత సమర్థవంతంగా పూర్తి చేయగలుగుతారు.
తాజావార్తలు
-
Tollywood: సీక్వెల్ కావాలంటున్న స్టార్ హీరో.. ‘నో’ అంటున్న డైరెక్టర్!
-
BC Reservations: అసెంబ్లీ ముందుకు బీసీ రిజర్వేషన్ బిల్లు.. స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్స్..
-
RC17: రామ్ చరణ్ ఊరమాస్ మేకోవర్.. సుకుమార్ పక్కా స్కెచ్!
-
Explainer: పాక్ కొత్త పొత్తులు, పాత కక్షలు.. దాయాది దారి ఎటు?
-
Tamil Nadu: “విజయ్ ప్రియమైన త్రిషకు డిప్యూటీ సీఎం పదవి ఎప్పుడు.?” అన్నాడీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..