సాధారణంగా భర్తలు, భార్యలను కొట్టినప్పుడో, తిట్టినప్పుడో చుట్టుపక్కల వారు చాలా మాటలు అనడం చాలాసార్లు వినే ఉంటాం.. భార్యలను కొట్టడం భర్త జన్మహక్కు అని కొందరు.. వాడి పెళ్ళాం.. వాడి ఇష్టం.. కొట్టుకుంటాడో.. కోసుకుంటాడో మనకెందుకు అని ఇంకొందరు.. భార్యభర్తల మధ్య మూడో వ్యక్తి ఎంటర్ అయితే అంతే సంగతులు మనకెందుకు అని మరికొందరు మాటలు చెప్తూ ఉంటారు. అస్సలు భార్యాభర్తల మధ్య ఆ గొడవలకు కారణం ఏంటి అనేది వారికి మాత్రమే తెలుస్తోంది. అందుకే జాతీయ కుటుంబ ఆరోగ్య సంస్థ ఆ కారణాలను తెలుసుకొనే ప్రయత్నం చేయగా.. పలు ఆసక్తికరమైన సమాధానాలు వచ్చాయంట.. భార్యను భర్త కొట్టడం తప్పు కాదా..? అని అడిగిన ప్రశ్నకు ఎక్కువశాతం మహిళలు అందులో తప్పేముంది.. అని చెప్పడం గమనార్హం.
అసలు ఇంతకీ భార్యను భర్తలు ఎందుకు కొడుతున్నారు అనేదానికి భర్తలు 7 కారణాలు చెప్పారంట.. ఆ కారణాలు ఏంటంటే .. ఎక్కువ శాతం మంది భార్య తమకు చెప్పకుండా బయటికి వెళ్లడం వలన కొట్టినట్లు చెప్పారు. ఆ తరువాత భార్య చెప్పిన మాట వినకపోవడం, పిల్లలను సరిగ్గా చేసుకోకపోవడం, వంట సరిగ్గా చేయకపోవడం, సెక్స్ కి తిరస్కరించడం, చీటికీ మాటికీ వాదనకు దిగడం, వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు అనుమానం రావడం, భర్త తరపు బంధువులను గౌరవించకపోవడం లాంటివి ఉన్నాయని సర్వే ద్వారా తెలిసింది. ఇకపోతే ఈ సర్వేలో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన భార్యాభర్తలు పాల్గొన్నారు.